
కడప కల్చరల్ VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 30:
భగవద్గీత అన్ని జ్ఞానా లకు మూలమని, తరగని ఆధ్యా త్మిక నిధే కాకుండా, అనంత మైన అమృత సముద్రమని కడప చిన్మ య మిషన్ అధ్యక్షులు స్వామి తురీయానంద సరస్వతి అన్నారు
శనివారం పాత కడపలో ‘దశమ హావిద్వాన్ ‘ శ్రీ నాగేంద్ర మహోధర స్వామి, ఆశీస్సులతో ‘సనాతన ధర్మ సామూహిక ప్రార్ధనా దేవాల యాల సంస్థ’ ప్రారంభిం చారు.ఈ సందర్భంగాతురీయానంద సర స్వతి సందేశం ఇస్తూ ప్రపం చంలో అన్ని ఆధ్యాత్మిక సాహి త్యాలలో భగవద్గీత తో సమాన మైన, స్ఫూర్తిదాయకమైన గ్రంథం మరొకటి లేదన్నారు గీతను అనుసరించిన మానవుడు ఉత్తమ జీవన విధానాన్ని అలవర్చు కుంటాడని అన్నారు. సభాధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ రామాయ ణ,భారత,భాగవతాలు నేటి సమాజానికి ఎంత ఉపయో గకరంగా ఉంటాయో స్పష్టం చేశారు. ముఖ్య అతిథి మామిళ్ల వెంకటరమణయ్య, లోకనాథం ప్రసంగిస్తూ నేటి యువత ఉత్తమ జీవన విధానాన్ని అలవర్చుకో వాలంటే రామాయణం కంటే మించిన నీతి శాస్త్రం మరొకటి లేదని చెప్పి రామాయణ ప్రత్యేకతను వివరించి చెప్పారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన పసుపులేటి శంకర్ సనాతన ధర్మాన్ని గురించి చెబుతూ సనాతనమంటే ముగింపు లేనిదని, ఇది కేవలం మతం కాదని, జీవితాన్ని నడిపించే నియమమని, నిజాయితీ,దయ,సద్భావన,సత్యం వంటిసద్గుణాలనుపెంపొందించుకోవడమే సనాతన ధర్మమని,ప్రతి మనిషికి భగవద్గీత పరిష్కారం చూపుతోందన్నారు
,