
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పలబంధంరోడ్ లో సత్తేరుకుంట పరిసర ప్రాంతం నివాసులు భక్తితో ఏర్పాటు చేసి పూజలు పురస్కరించుకొని నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న గణపయ్యను కల్లూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్..డి హరిత గారు స్థానిక పేదలు పిలుపును స్వీకరించి స్థానిక గణపయ్యను దర్శించుకొని వారి సన్మానాన్ని పొంది… నిమజ్జనానికి సంబంధించిన సూచనలను కమిటీ నిర్వాహకులకు తెలియజేశారు…ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పొన్నూరు వెంకటేశ్వరరావు,కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆళ్లకుంట,పెద్దలు ఇల్లూరు కృష్ణ,వెంకటేశ్వరావు, చాపలా నాగరాజ్,మైనార్టీ నాయకులు రంజాన్..మహిళా మణులు పాల్గొన్నారు…