Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట పంచాయతీ మందలో గ్రామకంఠం లో వేసిన రేకుల షెడ్లు బంకులు, మంగళవారం సాయంత్రం నాటికి తొలగించాలి. ఒంటిమిట్ట సర్పంచ్ కత్తి .సుజాత

ఒంటిమిట్ట పంచాయతీ మందలో గ్రామకంఠం లో వేసిన రేకుల షెడ్లు బంకులు, మంగళవారం సాయంత్రం నాటికి తొలగించాలి. ఒంటిమిట్ట సర్పంచ్ కత్తి .సుజాత

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట సెప్టెంబర్ 1

వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామపంచాయతీ సర్పంచ్ కత్తి సుజాత అను నేను పంచాయితీ ప్రజలకు తెలియజేయడమేమనగా సర్వేనెంబర్ 1500/బి1 లో ఉన్న పంచాయితీ భూమి గతంలో ఎనుముల మందగా పంచాయితీ ప్రజల అవసర నిమిత్తం ఉపయోగపడుతూ ఉండేది కాలక్రమేనానుసారం పంచాయితీ స్థలమైన, సర్వే నంబర్ 1500 బి1 లో ఉన్నటువంటి భూమి అక్రమ అక్రమార్కుల చేతిలో ఆక్రమణకు గురై గ్రామపంచాయతీ అభివృద్ధికి నోచుకోనివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఈ స్థలమును గ్రామపంచాయతీ ఉపయోగించుకొని సరైన రీతిలో రూములు కట్టి లేదా జీవనభృతి నిమిత్తం ఎవరైతే అర్హులై ఉన్నారో వారికి మండల జిల్లా అధికారులు చర్చలు జరిపి తగు చర్యలు తీసుకుంటారు. గ్రామపంచాయతీ అభివృద్ధి చెందుతుందని గ్రహించి అక్కడ ఉన్నటువంటి అక్రమ ఆక్రమణలను తొలగించుటకు గ్రామపంచాయతీలోని నాయకులు, మండల అధికారులు, గ్రామ పెద్దలు, మందలో ఉన్న బంకుల వ్యాపారస్తులు, ప్రజలందరూ సహకరించవలెనని తెలియపరుస్తున్నాను.

2,858 Views

You may also like

Leave a Comment