
కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 4
కడప జిల్లాకమలాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర యువనేత, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి కలిసారు. ఈ సందర్భంగా ఆయన, గతంలో పాదయాత్ర సందర్భంలో టక్కోలు గ్రామానికి వచ్చినప్పుడు ప్రస్తావించిన ఖాదర్ బంగాలా వంతెన నిర్మాణం పూర్తి విషయాన్ని మళ్లీ గుర్తు చేశారు.
అలాగే, మహిళల సౌకర్యం కోసం శ్రీ శక్తి పతకం క్రింద , కడప మచుపల్లి బస్టాండ్ నుండి సిద్దవటం వరకు ఉన్న బస్ సౌకర్యాన్ని మళ్లీ అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, మూలపల్లి రాజశేఖర్ యాదవ్, యువ నాయకుడు రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు.