
Vrm media ప్రతినిధి రవికుమార్ ఖమ్మం
భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) లోని పలు నిబంధనలు ప్రజలకు తక్షణ న్యాయం అందడాన్ని అడ్డుకుంటున్నాయని, అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారం దుర్వినియోగం అయ్యే అవకాశముందని ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు.
దిలీప్ చౌదరి తాళ్లూరి లా కమిషన్ ఆఫ్ ఇండియాకు ఈ ప్రతినిధి పత్రాన్ని సమర్పించగా, లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆ విషయాన్ని పరిశీలించిన అనంతరం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ (జుడీషియల్) కు ఎండార్స్ చేసింది.
అట్టి ఏండార్స్్మెంట్ కి అనుగుణంగా డిటైల్డ్ డ్రాఫ్ట్ ని డిప్యూటీ హోమ్ సెక్రటరీ కి లేఖ ద్వారా పంపటం జరిగింది.
సవరణలకు ప్రతిపాదించిన ముఖ్య విభాగాలు:
సెక్షన్ 35(3) BNSS : 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న నేరాల్లో అరెస్ట్‌కు బదులు నోటీసు ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే నాన్-బెయిలబుల్ కాగ్నిజబుల్ నేరాలు (మోసం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మహిళలు–పిల్లలపై నేరాలు, సైబర్ మోసాలు) ఈ నిబంధన నుంచి మినహాయించాలని సూచించారు.
సెక్షన్ 43(3) BNSS : హ్యాండ్‌కఫ్స్ వినియోగం కేవలం టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్ లేదా తప్పించుకునే అవకాశం ఉన్న నేరస్థులపైనే పరిమితం చేయాలని, కోర్టు అనుమతి తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు.
సెక్షన్ 107 BNSS : ఆస్తి అటాచ్మెంట్ కాలాన్ని 14 రోజుల నుండి 30 రోజులకు పెంచి, నిరపరాధ మూడవ పక్షానికి రక్షణ కల్పించాలని సూచించారు.
సెక్షన్ 111 BNS : ఆర్గనైజ్డ్ క్రైమ్ నిర్వచనాన్ని స్పష్టంగా చేసి, కనీసం 3 మంది ఆర్థిక ప్రయోజనం కోసం నేరపూరితంగా పనిచేసే గుంపును మాత్రమే ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా పరిగణించాలని ప్రతిపాదించారు.
సెక్షన్ 172 BNSS : పోలీసుల “లాఫుల్ డైరెక్షన్స్” కి స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్ల అధికారం దుర్వినియోగం జరుగుతోందని, దీనికి పరిమితి విధించాలని సూచించారు.
సెక్షన్ 173(3) BNSS : ప్రాథమిక దర్యాప్తుకు 14 రోజులు ఇవ్వడం వల్ల ఆలస్యం అవుతోందని, గరిష్టంగా 7 రోజుల్లో పూర్తిచేయాలని ప్రతిపాదించారు.
సెక్షన్ 187 BNSS : రిమాండ్ గరిష్టంగా 30 రోజులు మాత్రమే ఇవ్వాలని, దర్యాప్తు పూర్తికాకపోతే ఆటోమేటిక్ బెయిల్ ఇవ్వాలని సూచించారు.
సెక్షన్ 218 BNSS : ప్రభుత్వ ఉద్యోగులపై ప్రాసిక్యూషన్ అనుమతి 120 రోజులు ఆటోమేటిక్‌గా ఇవ్వబడుతోంది. దీన్ని 30–60 రోజుల్లోనే నిర్ణయించాలనీ, అవినీతి/కస్టోడియల్ టార్చర్ కేసుల్లో మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సెక్షన్ 223 BNSS : కోర్టు ఆరోపితుడిని కోగ్నిజెన్స్ దశలో వినిపించాల్సిన అవసరం లేదని, మేజిస్ట్రేట్ కారణాలు మాత్రమే నమోదు చేయాలని సూచించారు.
సెక్షన్ 250 BNSS : డిశార్జ్ పిటిషన్ 60 రోజులకు మాత్రమే పరిమితం కాకుండా, చార్జ్ ఫ్రేమ్ చేసే ముందు ఎప్పుడైనా దాఖలు చేయడానికి అనుమతించాలని సూచించారు.
సెక్షన్ 356 BNSS : గైర్హాజరులో ట్రయల్ 90 రోజుల బదులు కనీసం 180 రోజులు తర్వాత మాత్రమే ప్రారంభించాలని, హైకోర్టు అనుమతి తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు.
సెక్షన్ 530 BNSS : డిజిటల్ సిస్టమ్స్ (e-FIR, e-సమ్మన్స్) బదులు హైబ్రిడ్ మోడల్ (డిజిటల్ + మాన్యువల్) కొనసాగించాలి, ప్రైవసీ రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
న్యాయవేత్తల మద్దతు
ఈ ప్రతిపాదనలకు మద్దతుగా సీనియర్ కౌన్సిల్ శ్రీ స్వామి రమేశ్ కుమార్ గారికి , JAC చైర్మన్ బిచ్చల తిరుమలరావు గారికి , మాజీ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ మామిడి హనుమంతరావు గారికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసి, పూర్తి సహకారం అందించారు.
వారి విలువైన సూచనలు, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తాళ్లూరి దిలీప్ చౌదరి. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎక్కల సుబ్రహ్మణ్యం గారు, తెల్లకుల రమేష్ బాబు తది తరులు పాల్గొన్నారు.
– తాళ్లూరి దిలీప్ చౌదరి
అడ్వొకేట్, ఖమ్మం జిల్లా కోర్టులు
అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ.
8121112228.