Home వార్తలుఖమ్మం భాజపా రాష్ట్ర కోశాధికారిగా దేవకి వాసుదేవరావు.

భాజపా రాష్ట్ర కోశాధికారిగా దేవకి వాసుదేవరావు.

by VRM Media
0 comments

Vrm media ఖమ్మం ప్రతినిధి

  • అభినందించిన జిల్లా అధ్యక్షులు నెల్లూరు.
    ఖమ్మం, సెప్టెంబర్ 08.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కమిటీలో ఖమ్మం జిల్లా నాయకుడు దేవకి వాసుదేవరావుకి కీలక బాధ్యతలు లభించాయి. తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

ఈ జాబితాలో ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, దేవకి వాసుదేవరావును హృదయపూర్వకంగా అభినందించారు.

ఖమ్మం జిల్లా నాయకుడిగా దేవకి వాసుదేవరావు రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టడం పార్టీ బలపడేందుకు తోడ్పడుతుందని భాజపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

2,828 Views

You may also like

Leave a Comment