ప్రత్తిపాడు,vrm media ప్రతినిధి prince, సెప్టెంబర్, 17:-

కాకినాడ జిల్లా..
ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన గళ్ళ సూరిబాబు భార్య ఇటీవల కాలంలో ఆరోగ్యం బాలేదని కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే మురళిరాజు హాస్పిటల్ కి వెళ్లి పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం కోసం డాక్టర్స్ ను సంప్రదించి సూరిబాబు కుటుంబాలకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అనంతరం ఎం ఎం ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో నియోజకవర్గంలో రాజకీయాలతో సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా ఎవరైనా ఏ అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అందించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు మరియు ఎం ఎం ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణ రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముదునూరి అభిమానులు పెద్దలు పాల్గొన్నారు