

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 22
సిద్ధవటం మండలం దసరా ఉత్సవాల సందర్భంగా గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజ అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు సిద్ధవటం మండలంలోని పొన్నోలు గ్రామంలో సోమవారం రాత్రి దసరా శరన్న నవరాత్రుల సందర్భంగా భక్తులకు అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మల్లికార్జున శర్మ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కలిసి పూజ కుంకుమార్చన అభిషేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించామని దేవీ నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తొలగిపోతాయని అక్టోబర్ 2 తేదీ వరకు వివిధ అలంకరణ రూపముతో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుందని కావున గ్రామంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవలో పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు