


సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైభవంగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటం మండలం తెలుగుదేశం నాయకులు దైవారాధన ప్రజలకు ఎంతో ముఖ్యము అని అన్నారు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్న ఎంతో కొంత దైవచింతన ప్రతి మనసులోనూ ఉంటే ఒకరికొకరు అన్యోన్యంగా ఐకమత్యంగా మెలగ గలరని వారు భావించారు.
కాగా విజయదశమి సందర్భంగా బెజవాడ కనకదుర్గాదేవిని దర్శించుకున్న అనంతరం కాణిపాక విజ్ఞేశ్వర స్వామి వారిని, స్వర్ణ దేవాలయం లక్ష్మీదేవిని, అరుణాచలం అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారిలో మేము కూడా ఉండాలని ప్రార్థనలు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల టిడిపి అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దశరధ రామానాయుడు, స్టేట్ నూర్ భాషా కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు, స్టేట్ బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి కాడే శ్రీనివాసులు నాయుడు, పెద్దపల్లి పంచాయితీ సర్పంచ్ ప్రతినిధి తుర్ర ప్రతాప్ నాయుడు, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ ముద్దాల నాగేష్ నాయుడు, మాధవరం 1 టిడిపి గ్రామ ప్రధాన కార్యదర్శి మామిళ్ల మురళి పాల్గొన్నారు.