Home ఆంధ్రప్రదేశ్ పటాసుల విక్రయంపై నిబంధనలు తప్పనిసరి – అతిక్రమిస్తే కఠిన. చర్యలు.

పటాసుల విక్రయంపై నిబంధనలు తప్పనిసరి – అతిక్రమిస్తే కఠిన. చర్యలు.

by VRM Media
0 comments


ఒంటిమిట్టCI. బాబు

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 18

ఒంటిమిట్ట మండలం:
దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా విక్రయాలు ఊపందుకోనున్న నేపథ్యంలో, పటాసులు అమ్మే దుకాణదారులు ప్రభుత్వం విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఒంటిమిట్ట.CI. బాబు. హితవు పలికారు శనివారం నాడు విలేకరులతో మాట్లాడిన ఆయన, బాణాసంచా విక్రయించే ప్రతి వ్యాపారుడు తాసిల్దార్, పోలీస్, అగ్నిమాపకశాఖ అధికారుల అనుమతులతో పాటు అవసరమైన లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని సూచించారు నిర్మానుష ప్రాంతాల్లో మాత్రమే దుకాణాలు: పటాసుల దుకాణాలను జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కాకుండా, ఊరికి దూరంగా ఉన్న నిర్మానుషప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, ప్రజల భద్రత దృష్ట్యా ఇది అత్యంత ముఖ్యమని వివరించారు. అలాగే ప్రతి దుకాణంలో నీరు, ఇసుక, అగ్నిమాపక సౌకర్యాలు అందుబాటులో ఉండాలని చెప్పారు నిబంధనల ఉల్లంఘనకు లైసెన్స్ రద్దు: ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా బాణాసంచా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు అధిక ధరలకు అమ్మకూడదు: పటాసుల ధరల్లో అధిక లాభాల ఆశతో ప్రజలను మోసం చేయడం వంటి ప్రవర్తనను సహించబోమని, ప్రామాణిక ధరలకే విక్రయాలు జరగాలని దుకాణదారులను సూచించారు. ప్రజలు కూడా అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని, అటువంటి దుకాణాలపై అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు ఈ సందర్భంగా ప్రజలందరూ దీపావళిని సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని, పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే బాణాసంచా కాల్చాలని CI బాబు తెలిపారు.

2,827 Views

You may also like

Leave a Comment