

బద్వేల్ నియోజకవర్గం VRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 30
బద్వేలు నియోజకవర్గం గాంధీనగర్ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలోగల మహేశ్వర్ రెడ్డి ప్రాథమికోన్నత పాఠశాల నందు డాక్టర్ పి .శరత్ చంద్ర మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పాఠశాల యందలి విద్యార్థి విద్యార్థు నులకు కీటకజనిత వ్యాధుల గురించి మరియు పరిసర పరిశుభ్రత చేతుల శుభ్రత గురించి అక్కడి పిల్లలకు వివరించడం జరిగినది వాతావరణ మార్పుల వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా డయేరియా టైఫాయిడ్ కామెర్లు లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక మీరంతా పాఠశాల చుట్టుప్రక్కల మరియు మీ ఇంటి చుట్టూ పరిసరాల్లో నీటి నిలువలు లేకుండా చూసుకోవడం వల్ల ఈ దోమల అనేవి అభివృద్ధి చెందకుండా ఉంటాయని ఈ దోమలను ప్రారంభ దశలోనే అరికడితే అనగా ఈ నీటి నిలువలలో దోమలు గుడ్లు పెట్టి అవి లార్వా ప్యూప అడల్ట్ దోమగా అభివృద్ధి చెంది అవి మనల్ని కుడితే ఇలాంటి జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మన ఇంటి చుట్టూ ప్రక్కల మన పాఠశాల చుట్టుపక్కల నీటి నిలువలు లేకుండా చూసుకుంటే ఇలాంటి వ్యాధులనుండి మనము మన చుట్టుపక్క ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మరియు కాచి చల్లార్చిన నీటిని త్రాగడం వల్ల కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆహారానికి ముందు కాలకృత్యాలు తర్వాత చేతులు శుభ్రంగా కడుకోవాలని వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని రాత్రిపూట దోమతెరలు శరీరానికి నిండు దుస్తులు కిటికీలకు తలుపులకు దోమల వలలు వేపాకు పొగ లాంటివి వేసుకోవడం వల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనమంతా చాలా వరకు ఆరోగ్యంగా ఉంటామని అక్కడి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పి.శివరామిరెడ్డి హెల్త్ అసిస్టెంట్ కె వెంకటసుబ్బయ్య ఏఎన్ఎం ఎస్ కరీమున్ ప్రిన్సిపల్ వెంకటసుబ్బయ్య సుజాత ఆశ రాములు ఉమాదేవి ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమం అనంతరం పిల్లల చేత మానవహారం చేయించడం జరిగినది.