Vrm Media ప్రతినిధి ఖమ్మం







కొణిజర్ల మండలం అన్నవరం గ్రామానికి చెందిన తేజావత్. శిల్ప తన భర్త ఆకస్మిక మరణం తో తన ఇద్దరు పిల్లలతో కలిసి అన్నవరం గ్రామం లోని తల్లిదండ్రుల వద్ద నివసిస్తుంది. తన కుటుంబం పేదరికంలో ఉన్నప్పటికీ ఎంతో కష్ట పడుతూ దాతల సహకారం తో ఖమ్మం లోని శ్రీవిద్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మల్టిపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్ )మొదటి సంవత్సరం చదువుతుంది.తీరిక సమయంలో సామజిక అంశాల ఫై బొమ్మలు గీస్తు తన ప్రతిభ ను ప్రదర్శిస్తుంది.
చెట్లను రక్షిస్తే అవి కూడా మనల్ని రక్షిస్తాయని “వృక్షో రక్షితి రక్షితః”అనేది మన జీవనం లో భాగం కావాలి అని ఆలా జరిగితే భూమి ఫై ఉన్న ప్రతి జీవరాశి సంతోషం గా ఉంటుందని,అలాగే వ్యవసాయం భారతదేశం లో ఒక భాగమని ఎటువంటి కల్మషం లేని పల్లెటూరు యువతులు ఎంతో అనందం గా వ్యవసాయ పనులను చేస్తున్న చిత్రాన్ని గీసింది.వీటితో పాటుగా ఉపాధ్యాయుని గానే కాకుండా దేశనాయకునిగా విశేషసేవలు అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రం గీసానని,ప్లాస్టిక్ వాడడం అరికట్టకపోతే పర్యావరణ పరం గా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని,అంతే కాకుండా నేడు యువతను మరియు సమాజాన్ని పట్టి పీదిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అందరు కలిసి అరికట్టాలని,అలాగే అందరు పాజిటివ్ థింకింగ్ అలవారుచుకోవాలని ఫై చిత్రాలని గీసానని, చిత్రలెకణం ఫై కొంత శిక్షణ పొంది భవిష్యత్ లో చిత్రకారిణి గా అవ్వాలి అని కోరుకుంటున్నది.