Vrm Media ప్రతినిధి ఖమ్మం
ఖమ్మం ఖానాపురం 6వ డివిజన్ లో కృపాసన్నిధి చర్చి దగ్గరలో ఆదిత్య నగర్ రోడ్డు చివరి నందు కాళీ ప్లాట్లలో పెరిగిన పిచ్చి చెట్ల వల్ల భయంకరమైన కట్ల పాములు ,రక్త పెంజరలు ఇళ్ళలోనికి వస్తున్నాయి అక్కడ ఉన్న కుటుంబాలు ఎంతో భయాందోళనకు గురవుతున్నాము కాళీ ప్లాట్లలో భయంకరమైన చెట్లు పెరిగాయి ఎన్నోసార్లు పెద్దలకు చెప్పాము మా వీధిలో కరెంటు పోల్స్ లేవు, లైట్లు లేవు రాత్రి అయితే భయంకరమైన చీకటిలో ప్రమాదకరమైన విష సర్పాలనుతొక్కవలసి వస్తోంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అంటూ vrm media కీ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు తెలియజేయటం జరిగింది, ఈ సమస్యని త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.




