

Vrm Media ఖమ్మం ప్రతినిధి
కొణిజర్ల మండలం అన్నవరం ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు దేశ ప్రముఖ నాయకుల వేషధారణతో సందడి చేశారు. బాలలు, బాలికలు ఎంతో ఉత్సాహంగా గేయాలు పాడి, నృత్యరూపకాలను ప్రదర్శించి కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రుల సమావేశాన్ని కూడా నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి, చిన్నారుల విద్యా పురోగతి గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు అచ్యుత్, బాల ఏసు, అంగన్‌వాడీ టీచర్ పుష్పావతి, తల్లిదండ్రులు శిల్ప, నాగమణి, కళ్యాణి, పద్మ, నరసమ్మ, అనుష తదితరులు పాల్గొన్నారు.