Vrm Media ప్రతినిధి రాంబాబు ఖమ్మం




తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలకు పెండింగ్‌లో ఉన్న ₹1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త పాదయాత్ర ప్రారంభించారు.
ఖమ్మం నుండి హైదరాబాదు వరకు సాగుతున్న ఈ పాదయాత్రలో రాకేష్ దత్త మాట్లాడుతూ,
వేలాది మంది పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్య భవిష్యత్తు ఈ నిధులపై ఆధారపడి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఆలస్యం కారణంగా ప్రైవేట్ కాలేజీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని, విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పాదయాత్రకు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మరియు తల్లిదండ్రుల సమాఖ్యల నుండి విశేషమైన మద్దతు లభిస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని రాకేష్ దత్త ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.