Home ఎంటర్‌టెయిన్మెంట్ సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున భేటీ.. అభిమానుల్లో పండుగ వాతావరణం – VRM MEDIA

సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున భేటీ.. అభిమానుల్లో పండుగ వాతావరణం – VRM MEDIA

by VRM Media
0 comments
సజ్జనార్ తో చిరంజీవి, నాగార్జున భేటీ.. అభిమానుల్లో పండుగ వాతావరణం



-చిరంజీవి, నాగార్జున ఏం చెప్పబోతున్నారు
-సజ్జనార్ తో భేటీ
-అభిమానులు హ్యాపీ
-ఐ బొమ్మ మైండ్ బ్లాక్

పైరసీతో తెలుగు సినిమాని భయబ్రాంతులకు గురి చేస్తున్న ఐబొమ్మ(Ibomma)నిర్వాహకుడు రవిని శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రవిని కస్టడీ కి తీసుకొని మరింతగా విచారణ జరపడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక రవి తో అయితే తెలుగు సినిమాతో పాటు సినీ ప్రతినిధుల్లో పండుగ వచ్చి వాతావరణం వచ్చిందని చెప్పవచ్చు.

రీసెంట్ గా రవి అరెస్ట్ విషయంపై మాట్లాడటానికి మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి),కింగ్ నాగార్జున(నాగార్జున)సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(వీసీ సజ్జనార్)తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాల గురించి ఆ ఇద్దరు సజ్జనార్ తో చర్చించనున్నారు . పూర్తి వివరాలు భేటీ అనంతరం బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయి. పైరసీ పై సుదీర్ఘ కాలం చిత్ర పరిశ్రమ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

కూడా చదవండి: సిద్దార్ధ్ వైఫ్ అదితిరావుహైదరీ పేరుపై మెసేజెస్.. నమ్మచ్చా!

ఇక ఇప్పటికే రవికి సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, వెబ్‌లాగ్‌లు, సర్వర్‌ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ తో పాటు మరో సైట్ బెప్పం టీవీ లని క్లోజ్‌ చేయించారు. రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల హార్డ్‌డిస్క్‌లను పరిశీలనకి పంపడంతో పాటు ఇప్పటివరకు అతను అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాన్నీ కూడా పరిశీలించడంతో పాటు రవి వెనకెవరైనా ఉన్నారా అని కూడా ఆరాతీస్తున్నారు.



2,818 Views

You may also like

Leave a Comment