Home ఎంటర్‌టెయిన్మెంట్ గ్లోబ్ ట్రోటర్, వారణాసి, రాముడు.. వారణాసి కథ ఇదేనా! – VRM MEDIA

గ్లోబ్ ట్రోటర్, వారణాసి, రాముడు.. వారణాసి కథ ఇదేనా! – VRM MEDIA

by VRM Media
0 comments
గ్లోబ్ ట్రోటర్, వారణాసి, రాముడు.. వారణాసి కథ ఇదేనా!

[ad_1]


-కథ ఏంటి!
-ఎన్నో ప్రశ్నలు
-ప్రపంచ సిల్వర్ స్క్రీన్ పై వారణాశి వైభవం
-మహేష్ క్యారక్టర్ ఎలా ఉండబోతుంది

మొన్న శనివారం రామోజీ ఫిలింసిటీలో జరిగిన ssmb 29 టీం తమ సినిమాకి ‘వారణాశి’ అనే టైటిల్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటన వచ్చినప్పట్నుంచి ‘వారణాశి’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. నిజానికి వారణాశి అనేది భారతదేశపు చివరి నగరం పేరు. పరమేశ్వరుడు కాశీ విశేశ్వరుడుగా కొలువుతీరిన పుణ్యప్రదేశం. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా ‘వారణాశి’ని దర్శించాలని కోరుకుంటాడు. అంత పవర్ ఫుల్ ప్రాంతం. అలాంటిది మహేష్, రాజమౌళి తమ మూవీకి ‘వారణాశి’ అనే టైటిల్ నిర్ణయించడం ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. పైగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కూడా కావడంతో ‘వారణాశి’ స్థల వైభవం ప్రపంచ మూవీ లవర్స్ కి పరిచయం కావడం ఖాయం.

దీనితో అసలు ‘వారణాశి’ కథ ఏమైంటుందనే ఆలోచన అభిమానులు,మూవీ లవర్స్ లో మెదులుతుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు సూచిస్తూ మూవీలో మహేష్ బాబు గ్లోబల్ ట్రోటర్ గా కనిపించనున్నాడని మేకర్స్ మొదట వెల్లడి చేసారు. గ్లోబల్ ట్రోటర్ అంటే ప్రపంచాన్ని చుట్టే యాత్రికుడు అని అర్ధం. మొన్న జరిగిన ఈవెంట్ లో మహేష్ రాముడిగా కనిపించనున్నాడని, రామాయణానికి సంబంధించిన సీన్స్ ఉంటాయని కూడా చెప్పారు. టైటిల్ ని వారణాశి గా చెప్పారు. పైగా రాముడు పుట్టిన అయోధ్య, వారణాశి రెండు కూడా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి.

ఫస్ట్ లుక్ రిలీజ్ అయినపుడు మహేష్ మెడలో శివుడి ఆయుధంలో ఒకటైన త్రిశూలం లాకెట్ ని ధరించాడు. ఇన్ని క్యూరియాసిటీ లని కలిగిస్తున్న వారణాశి కి సంబంధించిన కథ ఏమై ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.ఈ విషయంలో ఎవరికీ తోచిన విధంగా వారు కథ పలానా విధంగా ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.


కూడా చదవండి: రజనీకాంత్ నటగురువు కన్నుమూత.. రాజకీయాల్లో ఆ రోజు ఏం జరిగింది

కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈవెంట్ లో రాజమౌళి చెప్పినట్టుగా ఎవరు ఊహించని కథ, కథనాలతో ‘వారణాశి’ తెరకెక్కబోతుంది. వరల్డ్ సినిమా షాక్ అయ్యేలా టెక్నీకల్ గా కూడా వండర్స్ ని క్రియేట్ చేయబోతుంది. టైటిల్ అనౌన్స్ సందర్భంగా విడుదల చేసిన ప్రీ ట్రైలర్ నే అందుకు ఉదాహరణ. ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారక్టర్ లు కూడా ఎవరు ఊహించని విధంగా ఉండబోతున్నారు. ముందు ముందు వారణాశితో ఎలాంటి చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుందో చూడాలి.

[ad_2]

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign