

ప్రత్తిపాడు Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 18:–
కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటికీటలాడాయి. ప్రత్తిపాడు మండలం ఎరకం పాలెం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో బ్రహ్మచారి లక్ష్మానంద స్వామి, వేద పండితులు కొక్కిరిగడ్డ సత్తిబాబు ఆధ్వర్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కి రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. లక్ష్మానంద స్వామీజీ మాట్లాడుతూ మాస శివరాత్రి సందర్భంగా ప్రతి నెల స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుందని తెలిపారు. కార్తీక మాసంలో మాసశివరాత్రి శివునికి ఇష్టమైన రోజు అని తెలిపారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఈశ్వరునికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.