

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 23
సిద్ధవటం మండలం భాకరాపేట 11 బెటాలియన్ ఈరోజు
గౌరవ కమాండెంట్ శ్రీ కె ఆనంద రెడ్డి గారి ఆదేశాల మేరకు బెటాలియన్లో శ్రీ సత్య సాయి బాబా గారి 100 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 11వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పి రాజశేఖర్ గారు హాజరయినారు, ముందుగా అసిస్టెంట్ కమాండెంట్ గారు శ్రీ సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ గారు మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మికవేత్త. ఇతనిని ‘గురువు’ అని, ‘వేదాంతి’ అని, ‘భగవంతుని అవతారం’ అని, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడని పలువురు విశ్వసిస్తారు.ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది అని మాట్లాడం జరిగినది. ఈ కార్యాక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పి రాజశేఖర్ గారు, RIs, RSIs, ARSIs, మరియు సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.