Home ఆంధ్రప్రదేశ్ స్మశాన రహదారి కల్పించండి

స్మశాన రహదారి కల్పించండి

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 24

స్మశాన వాటిక రహదారి ఏర్పాటు చేయాలని మండల తాసిల్దార్ ఆకుల తిరుమల బాబుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు మండలంలోని మాధవరం,1 ఆలీ నగర్ గ్రామంలో నివాసం ఉన్న ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన 450 పైబడి కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా మృతి చెందితే స్మశానంకు వెళ్లే రహదారి కూడా లేదని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మండల తహశీల్దార్ ఆకుల తిరుమల బాబుకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నేత షేక్ మస్తాన్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ నేతలు మృతి చెందితే స్మశానానికి వెళ్లే రహదారి లేక రైలు పట్టాలపై నుండి వెళ్తున్నామని అంత్యక్రియలకు వెళ్లడానికి వెళ్తున్న వృద్ధులు వయోవృద్ధులు రహదారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారని స్మశాన రహదారి ఏర్పాటు కొరకై రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకెళ్లామని మా సమస్య పరిష్కారం చేయాలని వినతి పత్రం సమర్పించామన్నారు టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల సమస్య పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తామని స్మశాన రహదారి ఏర్పాటు కొరకై నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చమ్మతి జగన్మోహన్ రాజు దృష్టికి మరోసారి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చొరవ చూపేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, పార్లమెంట్ కార్యదర్శి నాగ మునిరెడ్డి, మాధవరం టిడిపి నేత రాజారాం, అక్కి శెట్టి మణి, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

2,818 Views

You may also like

Leave a Comment