

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 26
సిద్ధవటం మండలం భాకరాపేట 11 బెటాలియన్ నందు గౌరవనీయులైన శ్రీ కె ఆనంద రెడ్డి ఆదేశాల మేరకు 11వ పోలీస్ బెటాలియన్ లో (26th నవంబర్ 2025) భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ కమాండెంట్
శ్రీ కె ఆనంద రెడ్డి హాజరయినారు. తదనంతరం ఆయన మన భారత రాజ్యాంగం గురించి వివరించడం జరిగినది ఇందులో భాగంగా రాజ్యాంగం పట్ల వినయ విధేయత ఉంటామని అందరిచేత ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. ఈ యొక్క కార్యాక్రమము నందు అసిస్టెంట్ కమాండెంట్ పి. రాజశేఖర్ RIs లు, RSIs లు, ARSIs లు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.