

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 27
ఒంటిమిట్ట కోదండ రామాలయం దీటుగా ఆవుల మారెమ్మ గుడి అభివృద్ది
శ్రీశ్రీ గోవింద రామాచార్యులు
ఒంటిమిట్ట మండలం కొండమాచ పల్లె గ్రామ సమీపంలో ఆవుల మారమ్మ గోవర్ధనగిరి గుడికి గురువారం శాస్త్రోత్తంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి గుడి పీఠాధిపతి శ్రీశ్రీ గోవింద రామాచార్యులు ఒంటిమిట్ట కోదండ రామాలయం అర్చకులు వీణ రాఘవాచారి మనోజ్ కుమార్ వేదమంత్రాలు మధ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ గోవింద రామాచార్యులు మాట్లాడుతూ ఒంటిమిట్ట రామాలయానికి దీటుగా ఆవుల మారెమ్మ గోవర్ధనగిరి అభివృద్ధి చెందుతుందన్నారు హిందువులంతా ఆవులు మారెమ్మ గుడిని సందర్శించడం ద్వారా ఆవులు మారెమ్మ గుట్ట గుడి మహా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆవులు మారెమ్మ గుడి పెన్సిల లక్ష్మీనరసింహ గోశాల ట్రస్ట్ చైర్మన్ రేవూరి వెంకట నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ దుంపల రమణారెడ్డి, అశోక్ శ్రీనివాస్ రెడ్డి, సింగర్ భగీరథ ఆలూరికిషోర్ మాజీ సర్పంచ్ శ్రీహరి తెలుగు యువత అధ్యక్షులు వెంకటరమణ వేణు ఒంటిమిట్ట చైర్మన్ పాటూరు గంగిరెడ్డి వేణు డాక్టర్ శివకుమార్ టిడిపి నాయకులు రోశయ్య తదితరులు పాల్గొన్నారు