


జేఏసీ నాయకులు ఒంటిమిట్ట తాసిల్దార్ కు వినతి పత్రం
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 28
కడప రెవెన్యూ డివిజన్ నుంచి ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను రాజంపేట డివిజన్ కు మార్చుతూ ప్రభుత్వం తెలియజేయడంతో ఒంటిమిట్ట సిద్ధపటం మండలాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది కడపకు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు మాత్రమే రాయచోటికి వెళ్లాలంటే 90 కిలోమీటర్ల వెళ్లాల్సి ఉంటుంది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక గౌరవాన్ని పెంచుతుంది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు పౌర్ణమి కళ్యాణానికి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు రామయ్యకు ఇవ్వడం ఏకశిలా నగరం ఒంటిమిట్టకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏకశిలా నగరం ఒంటిమిట్ట దేవస్థానాన్ని అధికారిక రాష్ట్ర దేవాలయంగా ప్రకటించుకోవడానికి ఒంటిమిట్ట ప్రజలు చేపట్టిన శాంతియుత ఆందోళన సాధించిన గొప్ప విజయం. ఒంటిమిట్ట సిద్ధం మండలాల ప్రజలు ఏకమై ర్యాలీలు ధర్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వం ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని దేవాలయం దృష్టిలో ఉంచుకుని తీరు మారి గతంలో ఉన్న ఒంటిమిట్ట సిద్ధం మండలాలను యధావిధిగా కొనసాగించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట చెరువు చైర్మన్ గంగిరెడ్డి. చెరువు వైస్ చైర్మన్ కట్టా యానాదయ్య. జేఏసీ నాయకులు రఘురాం రెడ్డి సుబ్బారెడ్డి. పాటయ్య. వెంకటేశు. బాలరాజు శివరాజు. తదితరులు. రవి. సుధాకర్ పాల్గొన్నారు.