

రంపచోడ నియోజవర్గం ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం పిఎంఆర్సి నందు ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బోజ్జి రెడ్డి కి పోలవరం నిర్వాసితుల సమస్యలపై భూమికి భూమికి,నష్టపరహారం,18 సంవత్సరాల ప్యాకేజీ గురించి,చెట్లకు నష్టపరిహారం చెల్లించాలని వినతి పత్రాలు అందజేశాము.ఈ విషయంపై ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి స్పందిస్తూ త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి దేవీపట్నం మండలంలోనే పోలవరం నిర్వాసితుల సమస్యలపై డేస్క్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.అలాగే ఆదివాసి ప్రజలు ఎదుర్కొంటున్న 19 రకాల సమస్యలపై వినతి పత్రాలు అందజేశామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు,సోదే బాపిరాజు,కుండ్ల సాయిరామ్ రెడ్డి,నడిపూడి గాంధీ రెడ్డి,కుండ్ల కృష్ణారెడ్డి,చెదల పార్వతి,వల్ల రామిరెడ్డి మొదలైనవారు పాల్గొన్నారు.