Home ఎంటర్‌టెయిన్మెంట్ టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు! – VRM MEDIA

టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు! – VRM MEDIA

by VRM Media
0 comments
టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు!

[ad_1]


సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ది రాజా సాబ్(The Raja Saab), మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu) సినిమాలకు తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఉంటుందా లేదా? అనే సస్పెన్స్ రూపం. ఈ విషయంపై ఈ రెండు చిత్రాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారికి హైకోర్టులో ఊరట లభించింది.

టికెట్ రేట్ల పెంపుని రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. రేట్ల పెంపు, స్పెషల్ షోల అనుమతి కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, దానిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరుతూ పిటిషన్లు వేశారు. విచారణ ఈరోజు జరిపిన న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన తీర్పును పుష్ప2, గేమ్‌ఛేంజర్‌, ఓజీ, అఖండ 2 సినిమాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లభించింది.

ది రాజా సబ్ జనవరి 9న విడుదలవుతుండగా, మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న విడుదలవుతోంది. హైకోర్టులో ఊరట లభించడంతో ఈ రోజు రాత్రికి రాజా సాబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

[ad_2]

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign