*”VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం
సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి :
— సమాజంలో వివిధ వర్గాలకు అందించిన సేవలకు గాను.. ఎమ్మెల్యే బలరామకృష్ణకు అత్యుత్తమ పురస్కారం
— రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ -4 కార్యక్రమంలోకి ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ సేవలు
— జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ కీర్తి చేకూరి చేతుల మీదుగా ఎమ్మెల్యే బలరామకృష్ణకు సత్కారం, ప్రశంసా పత్రం
సమాజంలో పేదరికం తగ్గించి.. బంగారు కుటుంబాలను తయారు చేయడానికి ప్రతి ఒక్కరు పి –4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలి
— ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ పిలుపు
👉 సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అందిస్తున్న సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం “ఉత్తమ మార్గదర్శి” అవార్డుతో పాటు ప్రశంసా పత్రం అందించి ఘనంగా సత్కరించింది. 2025 ఉగాది రోజున ప్రారంభమైన పి –4 కార్యక్రమం లో భాగంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు.. పేద వర్గాల ప్రజలను ఆదుకోవాలి. ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ 2024 ఎన్నికలకు రెండేళ్లు ముందు నుంచే అనేక సమాజసేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇప్పటికే కొనసాగిస్తున్నారు.
👉ముఖ్యంగా ప్రజలకు అత్యవసర వైద్య సేవలను సకాలంలో అందించే అంబులెన్స్ సర్వీస్ చేయవలెను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు రాజానగరం నియోజకవర్గంలో నిరుపేద వర్గ ప్రజలకు విద్య, వైద్యం, ఇతర అవసరాలకు ఆర్థికంగా చేయూతనిస్తూ వచ్చారు..
👉ముఖ్యంగా తన సొంత నిధులతో 3 అంబులెన్స్ లను కొని.. సీతానగరం కోరుకొండ రాజానగరం మండలాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు అంతేకాకుండా కోవిడ్ సమయంలో ప్రజలకు మందులు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఇక ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి.. వారిని అన్ని విధాలా ఆదుకున్నారు.
👉తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన మొందా తుఫాన్ సమయంలో తూర్పుగోదావరి జిల్లాతో పాటు విజయవాడలోనూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన సతీమణి బత్తుల వెంకటలక్ష్మితో కలిసి అక్కడ బాధితులకు నిత్యవసర సరుకులు, మంచినీరు అందించారు. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మొందా ఫైటర్ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు అందించి ఘనంగా సత్కరించింది.
👉తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ –4 కార్యక్రమం లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేసిన సేవలను పరిగణలోకి తీసుకున్నారు. ఉత్తమ మార్గదర్శి అవార్డు అందించి సత్కరించింది.
👉 ఉత్తమ మార్గదర్శి అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకు రావాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ –4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
👉 జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగ యువతకు సుమారు 900 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. అగ్ని ప్రమాదాల సమయంలో బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలిచారు.
👉తమ సొంత నిధులతో ఆర్థిక సహాయాలు అందించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ధైర్యంగా నిలబడి.. ఆర్థికంగా అదుకున్నారు. ఇదే కాదు.. ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు విద్య నిమిత్తం ఆర్థిక సాయం అందించారు.