
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-కన్నయ్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుదీర్ఘ ఉత్కంఠకు చివరకు తెరపడింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026″పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభించింది.
పెరిగిన భూమి ధరలు
ఈ చరిత్రాత్మక నిర్ణయం రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉవ్వెత్తున పైకి లేచింది. గెజిట్ విడుదలైన గంటల్లోనే రాజధాని ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఏడాది కాలంలో చూస్తే ఒక చదరపు గజం ధర రూ.10 వేల నుంచి రూ.40-50 వేలకు చేరింది.మెట్ట ప్రాంతంలో భూమి ధర గజం రూ.20-25 వేలు ఉండగా, ఇప్పుడు రూ.35-40 వేలకు పెరిగింది. రాజధాని సమీపంలోని మండలాల్లో కూడా పొలాలకు, స్థలాలకు 50 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయి. ఈ పెరుగుదలతో సామాన్యులకు స్థలాలు కొనుగోలు భారంగా మారుతోంది.

భవిష్యత్తులో ఎలా ఉంటుంది..?
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం అమరావతిలో రియల్ బూమ్ హైదరాబాద్ కంటే రెండింతలు ఉండబోతోంది.ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోనే కాకుండా గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, బాపట్ల వరకు ధరలు భారీగా పెరుగుతున్నాయి.అమరావతిలో 15 బ్యాంకుల ఆఫీసుల భవనాలతోపాటు ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ యూనివర్సిటీలు పనిలో పడ్డాయి.
BITS క్యాంపస్, XLRI, నేషనల్ లా యూనివర్సిటీ వంటి విద్యాసంస్థల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.త్వరలోనే ఆస్పత్రులు, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణం ఏకకాలంలో జరగనుంది.దీంతో ఉపాధి కోసం వచ్చేవారు పెరుగుతారు. ఈ గెజిట్ నోటిఫికేషన్‌తో పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడంతో పాటు రాజధాని ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది.
సీఆర్డీఏ పరిధిలో మధ్య తరగతికి అందుబాటులో ఇంటి ప్లాట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. రాజధాని అభివృద్ధి క్రమ పధ్ధతిలో ముందుకు వెళుతున్న భవిష్యత్తులో అంద రికీ ఇక్కడ స్థలాలు ఆమోదయోగ్యంగా మారుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి ఇటువంటి చట్టబద్ధత ఇంతవరకూ లేదు