Home ట్రెండింగ్ Gold News:ఇండియన్స్ వద్దే అత్యధిక పసిడి నిల్వలు – అసోచామ్ షాకింగ్ రిపోర్ట్..!! | గోల్డ్ న్యూస్-భారతీయ కుటుంబాలు 25,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నాయి, ప్రపంచంలోని టాప్ సెంట్రల్ బ్యాంకుల కంటే ఎక్కువ: అసోచామ్ నివేదిక – VRM MEDIA

Gold News:ఇండియన్స్ వద్దే అత్యధిక పసిడి నిల్వలు – అసోచామ్ షాకింగ్ రిపోర్ట్..!! | గోల్డ్ న్యూస్-భారతీయ కుటుంబాలు 25,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నాయి, ప్రపంచంలోని టాప్ సెంట్రల్ బ్యాంకుల కంటే ఎక్కువ: అసోచామ్ నివేదిక – VRM MEDIA

by VRM Media
0 comments
Gold News:ఇండియన్స్ వద్దే అత్యధిక పసిడి నిల్వలు - అసోచామ్ షాకింగ్ రిపోర్ట్..!! | గోల్డ్ న్యూస్-భారతీయ కుటుంబాలు 25,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నాయి, ప్రపంచంలోని టాప్ సెంట్రల్ బ్యాంకుల కంటే ఎక్కువ: అసోచామ్ నివేదిక


వ్యాపారం

ఓయ్-కన్నయ్య

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ప్రపంచానికే తెలుసు. కానీ, ఇప్పుడు అసోచామ్ (ASSOCHAM) వెల్లడించిన నివేదికలోని సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టాప్-10 దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వల కంటే, భారతీయ గృహిణుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని ఈ నివేదిక పేర్కొంది.

బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం కాదు..అదొక సెంటిమెంట్,ఒక భరోసా.అయితే ఈ భరోసా ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించే స్థాయికి చేరుకుంది.అసోచామ్ తాజా నివేదిక ప్రకారం, భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో ఉన్న సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.

Gold-news-indian-households-hold-25-000-tonnes-gold- more-worlds-top-central-banks-assocham-repo

బ్యాంకులను మించిన ఇంటి నిల్వలు

అమెరికా,జర్మనీ,ఇటలీ,ఫ్రాన్స్ వంటి టాప్-10 దేశాల కేంద్ర బ్యాంకులు (సెంట్రల్ బ్యాంకులు) భారీగా బంగారాన్ని నిల్వ ఉంచుతాయి. అయితే, భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం సుమారు 25,000 నుండి 27,000 టన్నులు ఉంటుందని అంచనా.అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) వద్ద ఉన్న నిల్వలు సుమారు 8,133 టన్నులు.జర్మనీ వద్ద 3,350 టన్నులు మాత్రమే ఉన్నాయి.కానీ, ఒక్క భారతీయ గృహిణుల వద్ద ప్రపంచాన్ని గుర్తించిన పసిడి నిధి దేశాలు ఈ నివేదికను సూచిస్తున్నాయి.

ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్ అధికారికంగా సుమారు 880 టన్నుల బంగారు నిల్వలను కలిగి ఉంది, ప్రపంచంలో 8వ స్థానంలో నిల్వ ఉంది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద బంగారు ఆభరణాల వినియోగదారుగా కొనసాగుతోంది.

పసిడిపై ఎందుకంత మక్కువ..?

ఆర్థిక మాంద్యం వచ్చినా, కాల్ వంటి విపత్తులు ఎదురైనా భారతీయులు మొదట నమ్మేది బంగారాన్నే.దీనిని ‘లిక్విడ్ క్యాష్’గా భావిస్తారు.భారత్‌లో బంగారం తరానికి బహుమతిగా అందుతుంది. ముఖ్యంగా వివాహ వేడుకల్లో సగటున 30% నుండి 50% ఖర్చుతో బంగారం కొనుగోలుకే కేటాయిస్తారు.గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ కంటే బంగారంలో పెట్టుబడి పెట్టడానికే ప్రజలు మొగ్గు చూపుతారు. భారత్‌లో అమ్ముడయ్యే బంగారంలో 60% పైగా గ్రామీణ ప్రాంతాల నుండే డిమాండ్ ఉంటుంది.బంగారం వినియోగంలో చైనాతో భారత్ ఎప్పుడూ పోటీ పడుతుంది. కానీ,నిల్వ ఉంచుకోవడంలో మాత్రం భారతీయులదే అగ్రస్థానం అని చెప్పొచ్చు.

ఆర్థిక వ్యవస్థకు ఒక సవాల్..

ప్రజల వద్ద ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఉండటం ఒక రకమైన ‘డెడ్ ఇన్వెస్ట్‌మెంట్’ అని నిపుణులు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్’ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఇంటి వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో వడ్డీ పెట్టి ప్రోత్సహిస్తోంది.గృహ బంగారంలో కేవలం 2 శాతాన్ని మాత్రమే ఆర్థిక ఆస్తులుగా మార్చగలిగిన,2047 నాటికి భారత్ GDP కి అదనంగా 7.5 లక్షల కోట్ల డాలర్లు జోడించి అసోచామ్ అంచనా వేసింది.భారత్ GDP 2047 నాటికి 34 లక్షల కోట్ల రూపాయల అంచనా వేయబడింది. బంగారు ఆదాయం జోడిస్తే ఇది 40 లక్షల కోట్ల డాలర్లను దాటవచ్చు .అంటే 2047 నాటికి భారత్ ఆర్థిక శక్తి మరింత పటిష్టంగా మారుతుంది.

ప్రపంచ దేశాల బ్యాంకులు తమ ఆర్థిక స్థితిగతులను కాపాడుకోవడానికి బంగారాన్ని నిల్వ చేస్తే.. భారతీయ గృహిణులు తమ కుటుంబ భవిష్యత్తు కోసం బంగారాన్ని భద్రపరుస్తున్నారు.ఇది భారత్ దాచుకున్న అతి పెద్ద ఆర్థిక రహస్యం.దేశంలోని ప్రతి ఇల్లు ఒక చిన్నపాటి రిజర్వ్ బ్యాంక్ అని అసోచామ్ నివేదిక మరోసారి నిరూపించింది. పసిడిపై భారతీయులకు ఉన్న ఈ అచంచలమైన నమ్మకమే దేశ ఆర్థిక వ్యవస్థను ఎటువంటి సంక్షోభంలోనైనా పడకుండా కాపాడుతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

2,803 Views

You may also like

Leave a Comment