
భారతదేశం
ఓయ్-సయ్యద్ అహ్మద్
అమెరికా-ఇరాన్ సంఘర్షణ ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ పాకుతోంది. ఈ యుద్ధానికి ముందు తెరిచి ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఆ తర్వాత దిగ్బంధించడంతో దాన్ని విడిపిస్తానని పంతం పట్టిన అమెరికా పలు విఫలయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈసారి తామే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ ప్రభావం భారత్ పై పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి (pm modi) ఇవాళ ట్రంప్ (donald trump) కాల్ చేశారు.
ఇరాన్ తో అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మోడీ-ట్రాంప్ మధ్య తొలి ఫోన్ కాల్ ఇదే. ఇవాళ ఇరువురు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ తో విఫలమైన అమెరికా-ఇరాన్ చర్చలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధం సహా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని గతంలో దిగ్బంధించిన ఇరాన్ భారత్ కు మాత్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు అమెరికా కూడా అలాంటి వెసులుబాటు ఇవ్వడానికి ప్రధాని మోడీ ట్రంప్ ను కోరినట్లు సమాచారం. అయితే ట్రంప్ ఏం హామీ ఇచ్చారో తెలియలేదు.

ఈ కాల్ సందర్భంగా ఇద్దరు నాయకులు మధ్యప్రాచ్య పరిస్థితి, వాణిజ్యంపై చర్చించారని భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఫోన్ ఏర్పాటు చేశారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలతో పాటు, వాషింగ్టన్‌లో అమెరికా-భారత్ మధ్య జరుగుతున్న కొన్ని కీలకాంశాల గురించి కూడా తమ అధ్యక్షుడు ప్రధాని మోడీతో చర్చించారని గోర్‌ప్రస్తావిస్తున్నారు. భారత ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని ప్రధాని మోదీ ఆ ఫోన్ కాల్ సందర్భంగా ట్రంప్‌తో అన్నారు.
నా స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి కాల్ వచ్చింది. వివిధ రంగాలలో మా ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని మేము సమీక్షించాము. అన్ని రంగాలలో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము కూడా చర్చించాము…
– నరేంద్ర మోదీ (@narendramodi) ఏప్రిల్ 14, 2026
అనంతరం ప్రధాని మోడీ ఫోన్ కాల్ పై ట్వీట్ చేశారు. “నా మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాలలో మన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.