Home ట్రెండింగ్ యుద్ధం ఆగింది: ట్రంప్ సంచలన ప్రకటన | ట్రంప్ ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య 10-రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు – ప్రధాన పురోగతికి చేరుకుంది – VRM MEDIA

యుద్ధం ఆగింది: ట్రంప్ సంచలన ప్రకటన | ట్రంప్ ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య 10-రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు – ప్రధాన పురోగతికి చేరుకుంది – VRM MEDIA

by VRM Media
0 comments
యుద్ధం ఆగింది: ట్రంప్ సంచలన ప్రకటన | ట్రంప్ ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య 10-రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు - ప్రధాన పురోగతికి చేరుకుంది


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సూచన ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ సాయంత్రం 5 గంటల నుంచి 10 రోజుల పాటు కొనసాగనుంది. అంటే భారత కాలమానం ప్రకారం సీజ్ ఫైర్ అర్ధరాత్రి 3 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ పవర్. ఈ మేరకు తమ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాధినేతలు అంగీకారం తెలిపినట్లు ట్రంప్ ప్రకటించారు. వచ్చే 10 పాటు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది. తాను ఇప్పటివరకూ 9 యుద్ధాలను ఆపేశానని.. ఇది పదోది కాబోతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య 34 ఏళ్లలో తొలిసారిగా చర్చలు జరిగాయి.

ఇక ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అమెరికా సంధి కుదుర్చుకుంది. 34 ఏళ్లలో తొలిసారిగా ఇరు దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ డీసీలో ప్రత్యక్షంగా సమావేశం అయ్యారు. ఇక ఇరు దేశాల మధ్య జరిగిన ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కీలక పాత్ర పోషించారు. ఇక ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య శాంతి స్థాపన కోసం ట్రంప్ ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. వారిలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అలాగే జైంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్ కూడా ఉన్నారు.

ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు ప్రధాన పురోగతి

ఇజ్రాయెల్- లెబనాన్ కాల్పుల విరమణపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మొత్తం పదవీకాలంలో ఇప్పటి వరకు 9 యుద్ధాలను ముగించానని ఇది పదో యుద్ధం అని ట్రంప్ ప్రకటించారు. ఇక ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గజాలో హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు తేదీ 22తో ముగియనుంది. ఇక ఇరాన్- అమెరికా మధ్య రెండో దశ శాంతి ఒప్పందం జరిగేందుకు రంగం సిద్ధం అవుతోంది.

2,801 Views

You may also like

Leave a Comment