

-గత నెల 26 న థియేటర్లలో అడుగుపెట్టిన కోర్టు జంట
-బ్యాండ్ మేళం మిస్ అయ్యారా
-డోంట్ వర్రీ
ఓటిటిలోకి వస్తుంది
కోర్ట్ మూవీతో హిట్ ఫెయిర్ గా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారు రోషన్, శ్రీదేవి. మరోసారి తమ మ్యాజిక్ ని రిపీట్ చేస్తు గత నెల 26న ‘బ్యాండ్ మేళం’తో అడుగుపెట్టారు. వైవిధ్యమైన కథాంశంతో, మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన అగ్ర కధారచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఆ డీటెయిల్స్ చూద్దాం
‘బ్యాండ్ మేళం స్ట్రీమింగ్ హక్కుల ZEE5 భారీ ధరకి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది. మీరు మీకిచ్చిన జంట మరోసారి దరువు వెయ్యబోతున్నారనే క్యాప్షన్‌తో అధికార ప్రకటన చేయడం విశేషం. గిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి )ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మధ్యలో ఏర్పడిన కొన్ని పొరపచ్చాల వల్ల విడిపోయిన వీరు, విద్యాభ్యాసం మరియు సంగీతం వైపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా కలిసినప్పుడు వారి మధ్య చోటు చేసుకున్న భావోద్వేగాలు, ప్రేమ, సంగీతం మిళితం చేసిన కథ ‘బ్యాండ్ మేళం’. సీనియర్ నటుడు సాయి కుమార్, గోపరాజు విజయ్ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు.
కూడా చదవండి: పవన్ కళ్యాణ్: ఇంకో వికెట్ జైలు గూటికి.. హద్దు మీరితే ఇంతే
సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించగా, విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం యువతని బాగా ఆకట్టుకుంది. పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. మరి థియేటర్లలో మిస్ అయిన వారు బ్యాండ్ మేళాన్ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.