Home ఎంటర్‌టెయిన్మెంట్ రాముడు vs నాగబాబు vs ప్రకాష్ రాజ్.. ప్రకాష్ రాజ్ అస్సలు ఊహించి ఉండడు – VRM MEDIA

రాముడు vs నాగబాబు vs ప్రకాష్ రాజ్.. ప్రకాష్ రాజ్ అస్సలు ఊహించి ఉండడు – VRM MEDIA

by VRM Media
0 comments
రాముడు vs నాగబాబు vs ప్రకాష్ రాజ్.. ప్రకాష్ రాజ్ అస్సలు ఊహించి ఉండడు


-ప్రకాష్ రాజ్ పై మండిపడుతున్న రామభక్తులు
-అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన నాగబాబు
-నాగబాబుకి రిప్లై ఇస్తాడా!

ప్రకాష్ రాజ్(ప్రకాష్ రాజ్),నాగబాబు(నాగబాబు)కి మధ్య మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాగబాబు బహిరంగంగానే మద్దతు తెలిపాడు. నాగబాబు నిర్మాతగా వచ్చిన ఆరెంజ్ లో ప్రకాష్ రాజ్ చెయ్యడంతో పాటు టోటల్ మెగా ఫ్యామిలీతో ప్రకాష్ రాజ్ కి మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ అనుబంధానికి ఫుల్ స్టాప్ పడే విధంగా నాగబాబు ట్వీట్ చేశారు. పూర్తి మ్యాటర్ చూద్దాం.

ప్రకాష్ రాజ్ ఇటీవల రాముడు, లక్ష్మణుడుని అవమానిస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రీసెంట్ గా నాగబాబు స్పందించారు మిస్టర్ ప్రకాష్ రాజ్, మిమ్మల్ని మీరు ‘క్రిస్టియన్ నాస్తికుడిని’ అని చెప్పినప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియల సమయంలో ఆమె విశ్వాసాలను గౌరవించారు. అదే స్ఫూర్తితో కోట్ల మంది ప్రజల నమ్మకాలని కూడా గౌరవించాలి. నాస్తికత్వం అంటే దేవుళ్లనో లేదా భక్తులనో ఎగతాళి చేయడం కాదు, అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానం. నాస్తిక వాదాన్ని కూడా తనలో కలుపుకొని, దానికి తగిన వాటిని కల్పించిన ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే. అటువంటి గొప్ప సంప్రదాయాన్ని కించపరచడం సరికాదు. వేరే దేశాల్లో గనుక మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే తీవ్రమైన ఇబ్బందుల్లో పడేవారు. భవిష్యత్తులో గౌరవప్రదంగా ప్రవర్తించని మీలాంటి వ్యక్తుల మాటలకి నేను ఎప్పుడు స్పందించానని తెలిపాడు.

కూడా చదవండి: Raasi: అజయ్ ఘోష్ పై రాశి ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను అనుకుంది ఆ హీరోని

నాగబాబు నిన్న మాత్రం ప్రకాష్ రాజ్ పేరు ఎత్తకుండా ‘శ్రీరాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు. ధర్మానికి ప్రతీక. ఆయనని అవమానించడం లేదా తగ్గించాలని చూడటం ధైర్యం కాదు. అదోక మానసిక అంధత్వం. రాముడిని ఎగతాళి చేసేవారు తమని తాము నష్టపరచుకుంటారు. అజేయమైన ధర్మాన్ని కాపాడే శక్తులు నిరంతరం పని చేస్తుంటాయి. చరిత్రలో న్యాయానికి వ్యతిరేకంగా నిలిచినవారు పతనమయ్యారు. రాముడిపై విషం చిమ్మే వారి భవిషత్తు కూడా అదే అవుతుంది. రాముడి పేరే ఒక కవచం. కథ ఖడ్గం. ఉనికి నాగరికతకి అచంచలమైన కోట’ అని పోస్ట్ చేసారు. అలాంటిది ఈ రోజు డైరెక్ట్ గా పేరుతోనే పోస్ట్ చెయ్యడం అవసరం.

?

2,801 Views

You may also like

Leave a Comment