
భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
ఇవాళ రాత్రి 8:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. అయితే ప్రధాని మోదీ ఏ అంశం మీద మాట్లాడుతారనేది స్పష్టత లేదు. అయితే పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేకపోయిన విషయం తెలిసిందే. దాంతో ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ.

ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందకపోవడంపై ప్రధాని నరేంద్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు విపక్షాలు అన్యాయం చేశాయని.. ఈ విషయంలో మూల్యం చెల్లించుకోక తప్పదని వారు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మహిళా బిల్లును ఓడగొట్టి ప్రతిపక్షాలు సంబరాలు చేసుకున్నాయని అన్నారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థరాజకీయాలకు మహిళా లోకం బలైంది. మహిళల కలలను ధ్వంసం చేశారు. నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు దేశం విపక్షాలు ఎలా ప్రయత్నించాయో మొత్తం చూసింది.. అని అన్నారు.