Home ఎంటర్‌టెయిన్మెంట్ ఇన్‌స్టా ‘సబ్‌స్క్రిప్షన్’ రచ్చ.. విష్ణు ప్రియకు పోటీగా అషూ రెడ్డి.. ఫ్యాన్స్ ఫైర్! – VRM MEDIA

ఇన్‌స్టా ‘సబ్‌స్క్రిప్షన్’ రచ్చ.. విష్ణు ప్రియకు పోటీగా అషూ రెడ్డి.. ఫ్యాన్స్ ఫైర్! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ ‘సబ్‌స్క్రిప్షన్’ అనేది ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. సెలబ్రిటీలు తమ ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోలను చూసేందుకు అభిమానుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో యాంకర్ విష్ణుప్రియ (విష్ణుప్రియ) టాప్ గేర్‌లో దూసుకుపోతుండగా, తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి (అషు రెడ్డి) కూడా ఈ బాటలోకి వచ్చింది. అయితే ఈ సందర్భంగా అషూ షేర్ వేసిన సెటైరికల్ వీడియో మాత్రం విష్ణు ప్రియ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.

విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో విష్ణుప్రియపై ఎన్నో విమర్శలు వచ్చాయి. పోలీస్ కంప్లైంట్లు కూడా నమోదయ్యాయి. అయినా విష్ణుప్రియ తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది.

అయితే తాజాగా అషూ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో వివాదానికి దారి తీసింది. “సబ్‌స్క్రైబర్స్.. గెట్ రెడీ ఫర్ మోర్ కంటెంట్ అంటూ, మోర్ వీడియోస్” వెటకారంగా నవ్వుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు విష్ణు ప్రియను ఉద్దేశించి చేసిన సెటైర్లుగా నెటిజన్లు. దీంతో విష్ణు ప్రియ అభిమానులు అషూపై ఫైర్ అవుతున్నారు.

అషూ రెడ్డి కూడా 14 రోజుల ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అంటూ ఆఫర్లు ఇస్తూ తన బిజినెస్ మొదలుపెట్టింది. ఇప్పటికే వందకు పైగా సబ్ స్క్రైబర్లు ఆమె ఖాతాలో చేరారు. విష్ణుప్రియ రేంజ్‌లో సబ్ స్క్రైబర్‌లను సంపాదించుకోవడానికి అషూ రెడ్డి కూడా అందాల ఆరబోతకు సిద్ధమవుతోందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరి అషూ రెడ్డి నిజంగానే బోల్డ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్ చేసిందా? లేక విష్ణుప్రియపై సెటైర్ కోసమే ఈ సబ్‌స్క్రిప్షన్ అంటూ హడావుడి చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. మునుముందు ఈ సబ్‌స్క్రిప్షన్ల గోల ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

2,802 Views

You may also like

Leave a Comment