Home ట్రెండింగ్ 30 ఏళ్లలోపు వర్జిన్ కావాలి! | విడాకులు తీసుకున్న ఐఐటీయన్ 30 ఏళ్లలోపు వర్జిన్ వధువును కోరాడు, ఇంటర్నెట్ అతని పితృస్వామ్య ద్వంద్వ ప్రమాణాలను స్లామ్ చేసింది – VRM MEDIA

30 ఏళ్లలోపు వర్జిన్ కావాలి! | విడాకులు తీసుకున్న ఐఐటీయన్ 30 ఏళ్లలోపు వర్జిన్ వధువును కోరాడు, ఇంటర్నెట్ అతని పితృస్వామ్య ద్వంద్వ ప్రమాణాలను స్లామ్ చేసింది – VRM MEDIA

by VRM Media
0 comments
30 ఏళ్లలోపు వర్జిన్ కావాలి! | విడాకులు తీసుకున్న ఐఐటీయన్ 30 ఏళ్లలోపు వర్జిన్ వధువును కోరాడు, ఇంటర్నెట్ అతని పితృస్వామ్య ద్వంద్వ ప్రమాణాలను స్లామ్ చేసింది


భారతదేశం

ఓయ్-జక్కీ మహేష్

ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా ఇంకా పాతకాలపు ఆలోచనలతోనే ఉన్నారా? అనే అనుమానం కలిగేలా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. 37 ఏళ్ల వయస్సు ఉండి.. ఇప్పటికే ఓ సారి విడుదలైన ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్.. తనకు కాబోయే భార్య విషయంలో పెట్టిన శరతులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక బిలియన్ కంపెనీ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి.

వింత నిబంధనలు.. విస్తుపోయిన మ్యాచ్ మేకర్
ఓంద్రిలా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి తన కోరికలను ఈ విధంగా వెల్లడించాడు. “నాకు కాబోయే భార్య వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి. ఆమెకు గతంలో ఎలాంటి ప్రేమ వ్యవహారాలు ఉండకూడదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెంది ఉండాలి.. ముఖ్యంగా ఆమె కన్నె పిల్ల (వర్జిన్) అయి ఉండాలి.” అతని డిమాండ్‌లు విన్నేంద్రిలా షాక్‌కు గురయ్యారు. మీరు ఇప్పటికే ఇలాంటి విడాకులు తీసుకున్న వారు కదా.. మరి మీకు సంబంధం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు.. దానికి అతను ఇచ్చిన సమాధానం మరింత వింతగా ఉంది.

విడాకులు తీసుకున్న ఐఐటీయన్ 30 ఏళ్లలోపు వర్జిన్ వధువును ఇంటర్నెట్ అతని పితృస్వామ్య ద్వంద్వ ప్రమాణాలను దూషించాడు

నేను మగాడిని.. నాకు వర్తించవు..
ఎక్కువ మంది భాగస్వాములతో సంబంధాలు ఉన్న మహిళలు విశ్వాసంగా ఉండరని తన పరిశోధనలో తేలిందని ఆ వ్యక్తి వాదించాడు. మరి ఇదే తర్కం విడాకులు తీసుకున్న మీకు కూడా వర్తిస్తుంది కదా అని ఒంద్రిలా అడగగా.. “నాకు అది వర్తించదు, ఎందుకంటే నేను మగాడిని. ఇది సరైన పోలిక కాదు” అని అతను నిర్మొహమాటంగా చెప్పాడు. అతని పితృస్వామ్య ధోరణిని చూసి అసహనం వ్యక్తం చేసిన ఓంద్రిలా.. ఆ క్లయింట్‌ను రిజెక్ట్ చేశారు. “నిన్ను ఎవరూ మోసం చేయడం లేదు, నీ పాతకాలపు ఆలోచనలతో నువ్వే ఆ అమ్మాయిలను మోసం చేస్తావు” అని ఆమె గట్టిగా బదులిచ్చారు.

అందుకే విడాకులయ్యాయంటూ నెటిజన్ల ఆగ్రహం
ఈ పోస్ట్ వైరల్ అయిన నెటిజన్లు సదరు వ్యక్తిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. “అతని ధైర్యం చూస్తుంటే ఆశ్చర్యమే.. బహుశా ఇలాంటి మనస్తత్వం వల్లే మొదటి భార్య విడాకులు ఇచ్చి ఉంటుంది” అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు “ఎక్స్‌పైరీ అయిపోయిన మగాళ్లకు అంత సీన్ లేదు” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. విడాకులు తీసుకున్న వారు విడాకులు తీసుకున్న వారిని వెతుక్కోవాలి కానీ.. ఇలాంటి వింత కోరికలు కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

సామాజిక స్పృహ లేని చదువు వ్యర్థం
ఈ ఘటన ఇండియాలో ఇంకా వేళ్లూనుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థను ప్రతిబింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంతటి గొప్ప చదువులు చదివినా, భాగస్వామి పట్ల సమానత్వం లేని ఆలోచనలు ఉండటం విచారకరమని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐటియన్ పెళ్లి గోల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.



2,801 Views

You may also like

Leave a Comment