Home ట్రెండింగ్ టీ కప్పులో తుఫాన్ రేపిన ట్రంప్..! భారత్ ఆగ్రహంతో యూటర్న్..! | ట్రంప్ భారత్‌ను ‘హెల్‌హోల్’ అని పిలిచిన తర్వాత నష్టాన్ని పరిమితం చేయడానికి యుఎస్ ఎత్తుగడలు – VRM MEDIA

టీ కప్పులో తుఫాన్ రేపిన ట్రంప్..! భారత్ ఆగ్రహంతో యూటర్న్..! | ట్రంప్ భారత్‌ను ‘హెల్‌హోల్’ అని పిలిచిన తర్వాత నష్టాన్ని పరిమితం చేయడానికి యుఎస్ ఎత్తుగడలు – VRM MEDIA

by VRM Media
0 comments
టీ కప్పులో తుఫాన్ రేపిన ట్రంప్..! భారత్ ఆగ్రహంతో యూటర్న్..! | ట్రంప్ భారత్‌ను 'హెల్‌హోల్' అని పిలిచిన తర్వాత నష్టాన్ని పరిమితం చేయడానికి యుఎస్ ఎత్తుగడలు


అంతర్జాతీయ

-సయ్యద్ అహ్మద్

అమెరికా (యుఎస్) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (డొనాల్డ్ ట్రంప్) భారత్‌ (ఇండియా)ను “నరకకూపం” అని అభివర్ణించే పాడ్‌క్యాస్ట్‌ను రీపోస్ట్ చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ పరిణామాలపై వాషింగ్టన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సాయంత్రానికి అమెరికా రాయబార కార్యాలయం భారత్, దేశ నాయకత్వాన్ని ప్రశంసించింది.

అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ తన పాడ్ కాస్ట్ లో భారత్, చైనాల్ని మురికి కూపాలుగా అభివర్ణించాడు. అయితే దీన్ని అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ముందూ వెనుకా చూసుకోకుండా తిరిగి పోస్ట్ చేయడంతో వివాదం తలెత్తింది. అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తూ సావేజ్.. భారత్, చైనాలను “నరకకూపాలు”గా అభివర్ణించాడు. ఈ పోస్ట్ తీవ్ర అలజడి సృష్టించింది. ట్రంప్ ఇప్పటికే అమెరికాలో పుట్టారన్న కారణంగా విదేశీ పిల్లలకు ఆటోమేటిగ్గా జన్మతః పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా కోర్టులు అడ్డుకున్నాయి. దీంతో ఆయన కోర్టులపైనా మండిపడుతున్నారు. ట్రంప్ ఈ పాడ్ కాస్ట్ ను రీపోస్ట్ చేయడంతో ఇలాంటి అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ట్రంప్ ను నేరుగా తప్పుబట్టలేదు.

ట్రంప్‌ భారత్‌ను హెల్‌హోల్‌గా పిలిచిన తర్వాత నష్టాన్ని పరిమితం చేసేందుకు యుఎస్ ఎత్తుగడలు

ట్రంప్ పోస్ట్ చేసిన పాడ్ కాస్ట్ కంటెంట్ పై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. మేము కొన్ని నివేదికలను చూశాము. దాని గురించి ఇంతే చెప్పగలను అని. అనంతరం రాయబార కార్యాలయ ప్రతినిధి.. అమెరికా ట్రంప్ ‘భారత్ గొప్ప దేశం, నాకు చాలా మంచి స్నేహితుడు దాని నాయకత్వంలో ఉన్నారు’ అని అన్నారని స్పష్టం చేశారు. ట్రంప్ తన వ్యాఖ్యల తర్వాత రేగిన ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నంగా, భారత్‌ను గొప్ప దేశంగా, సన్నిహిత భాగస్వామిగా ఆయన పేర్కొన్నారు. దీంతో సద్దుమణిగినట్లయింది.

2,802 Views

You may also like

Leave a Comment