Home ట్రెండింగ్ Free Petrol: లీటర్ పెట్రోల్ ఫ్రీ, ఎగబడుతున్న జనం | AP ఇంధన సంక్షోభం మధ్య తిరుపతిలో ఉచిత పెట్రోలు: ఇరాన్-అమెరికా యుద్ధ భయాలు పెరుగుతున్నందున బంక్ యజమాని 1 లీటర్ ఉచితం – VRM MEDIA

Free Petrol: లీటర్ పెట్రోల్ ఫ్రీ, ఎగబడుతున్న జనం | AP ఇంధన సంక్షోభం మధ్య తిరుపతిలో ఉచిత పెట్రోలు: ఇరాన్-అమెరికా యుద్ధ భయాలు పెరుగుతున్నందున బంక్ యజమాని 1 లీటర్ ఉచితం – VRM MEDIA

by VRM Media
0 comments
Free Petrol: లీటర్ పెట్రోల్ ఫ్రీ, ఎగబడుతున్న జనం | AP ఇంధన సంక్షోభం మధ్య తిరుపతిలో ఉచిత పెట్రోలు: ఇరాన్-అమెరికా యుద్ధ భయాలు పెరుగుతున్నందున బంక్ యజమాని 1 లీటర్ ఉచితం


ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు ఆంధ్రప్రదేశ్‌లోని వాహనదారులను వణికిస్తున్నాయి. యుద్ధం వస్తే చమురు సరఫరా ఆగిపోతుందనే భయంతో జనం ఒక్కసారిగా పెట్రోల్ బంకులపై దండెత్తారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది, అనేక బంకులు మూతపడ్డాయి. అయితే, ఇలాంటి కష్టకాలంలో తిరుపతిలోని ఒక బంకు యజమాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రాష్ట్రమంతా పెట్రోల్ కోసం మేర క్యూ కడుతుంది, తిరుపతిలోని తనపల్లి వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంకులో మాత్రం పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇంధన సంక్షోభం దృష్ట్యా వాహనదారులను ఆదుకునేందుకు బంకు యజమాని రాజేష్ రెడ్డి ప్రతి టూ వీలర్‌కు ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ‘ఫ్రీ’ అనే వార్త తెలియగానే బైకర్లు ఆ బంకు వైపు పరుగులు తీశారు. గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ప్రస్తుత సంక్షోభ సమయంలో సాటివారికి సాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇరాన్-అమెరికా యుద్ధ భయాలు పెరుగుతున్నందున AP ఇంధన సంక్షోభం మధ్య తిరుపతిలో ఉచిత పెట్రోల్ బంక్ యజమాని 1 లీటర్ ఉచితంగా అందిస్తున్నాడు

భయంతో పెరిగిన వినియోగం: 50 శాతం జంప్!

యుద్ధం భయం (Panic Buying), ఎన్నికల ఫలితాల తర్వాత భారీగా రెట్లు పెరుగుతాయనే అపోహతో.. ఏపీలో పెట్రోల్ వినియోగాన్ని అమాంతం పెంచేసింది. సాధారణ రోజుల్లో కంటే అమ్మకాలు ఏకంగా 50 శాతం పెరగడం. సాధారణంగా రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతుండగా, శనివారం ఏకంగా 10,345 కిలో లీటర్లు చేరింది. డీజిల్ విక్రయాలు కూడా 9,048 నుండి 14,156 కిలోల లీటర్లు పెరిగాయి. జనం పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని అధికారులు విశ్లేషిస్తున్నారు.

10 శాతం బంకులు ‘క్లోజ్’.. విక్రయాలపై ఆంక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,510 పెట్రోల్ బంకుల్లో దాదాపు 421 బంకులు (సుమారు 10 శాతం) స్టాక్ లేక ‘నో స్టాక్’ బోర్డులు పెట్టేశాయి. స్టాక్ ఉన్న చోట కూడా యజమానులు ఆంక్షలు విధిస్తున్నారు. లారీలకు రూ.5 వేలు, ట్రాక్టర్లకు రూ.1,500, స్కూటర్లకు కేవలం రూ.200 చొప్పున మాత్రమే ఇంధనాన్ని విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు తమ రోజువారీ పనులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగి పెట్రోల్ కంపెనీలతో సమీక్షిస్తోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, పెట్రోల్, డీజిల్ దొరకడనే భయం మాత్రం జనాన్ని వెంటాడుతూనే ఉంది.

2,802 Views

You may also like

Leave a Comment