Home ఎంటర్‌టెయిన్మెంట్ ఏ ఫిల్మ్ బై గిరి.. మే 8న ‘కాంతార’ హీరో మూవీ విడుదల! – VRM MEDIA

ఏ ఫిల్మ్ బై గిరి.. మే 8న ‘కాంతార’ హీరో మూవీ విడుదల! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (రిషబ్ శెట్టి) ‘కాంతార’తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ‘కాంతార’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యాడు. త్వరలో ఆయన మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. 2022లో రిషబ్ శెట్టి హీరోగా నటించిన ‘హరికథే అల్ల గిరికథే’ ఇప్పుడు తెలుగులో ‘ఏ ఫిల్మ్ బై గిరి’గా విడుదలవుతోంది.

స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిషబ్ శెట్టి ఫిలిమ్స్ బ్యానర్స్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో రిషబ్ శెట్టి, రచన ఇందిర జంటగా నటించిన ‘ఏ ఫిల్మ్ బై గిరి’ (ఎ ఫిల్మ్ బై గిరి) సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్, అనిరుద్ మహేష్ ద్వయం దర్శకులుగా పరిచయం అయ్యారు. ఎన్ సందేశ్ ఈ సినిమాను నిర్మించారు.

‘ఏ ఫిల్మ్ బై గిరి’ ఎంజి మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు మే 8న తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలవుతోంది. ఎన్.పి తాపేశ్వరి, హొన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

వాసుకి వైభవ్ సంగీతం అందించిన ఈ సినిమాకు రఘునాథ్ సిఎం సినిమాగ్రఫీ అందించారు. అలాగే భరత్ ఎంసి, ప్రదీప్ అర్ రావు ఈ మూవీకి ఎడిటర్స్.

2,804 Views

You may also like

Leave a Comment