

పెద్ది(పెద్ది)కి సంబంధించిన న్యూస్ రాకపోతే సోషల్ మీడియాకి పొద్దు పొడవదేమో అనేలా ఉంది. ఆ హింట్ ప్రకారమే రోజుకొక న్యూస్ హల్ చేస్తూ అభిమానులు,మూవీ లవర్స్ లో జోష్ ని తీసుకొస్తున్నాయి. ఈ కోవలోనే రీసెంట్ గా మరో క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తుంది. న్యూస్ ఏంటో చూద్దాం.
పెద్దికి సంబంధించి ఇప్పటి వరకు రెండు లుక్స్ వచ్చిన విషయం తెలిసిందే ఆ లుక్స్ తో చరణ్ (రామ్ చరణ్)క్రికెటర్ గా, కుస్తీటర్ గా రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడని అర్ధమయ్యింది ఇప్పుడు మూడో లుక్ త్వరలోనే రాబోతుందనే మాటలు వినపడుతున్నాయి. దీంతో ఆ లుక్ ఏమై ఉంటుందనే చర్చల్లో ఫ్యాన్స్ మునిగిపోయారు. కొత్త ముందైతే పలానా గెటప్ అంటూ నెత్తింట్లో తిష్ట వేశారు. మరి పెద్దిలో చరణ్ పలు క్రీడలలో ప్రావిణ్యం ఉన్న వ్యక్తిగా చేస్తున్న నేపథ్యంలో ఈ సారి ఎలాంటి గేమ్ కి సంబంధించిన లుక్ లో కనిపిస్తాడో చూడాలి.
కూడా చదవండి: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం
ప్రస్తుతం చిత్ర యూనిట్ పెద్ది కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉంది. అందులో భాగంగా ఇటీవల శృతి హాసన్, చరణ్ పై స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. ఇక పెద్ది రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే రూమర్స్ కి కౌంటర్ గా పెద్ది దర్శకుడు బుచ్చిబాబు(బుచ్చిబాబు)రిలీజ్ డేట్ మారదని ఘంటా పదంగా చెప్పాడు.