Home ఎంటర్‌టెయిన్మెంట్ కారా మూవీ రివ్యూ: కర మూవీ రివ్యూ – VRM MEDIA

కారా మూవీ రివ్యూ: కర మూవీ రివ్యూ – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


న‌టీన‌ట్లు: ధ‌నుష్‌, మ‌మితా బైజు, కె.ఎస్‌.ర‌విర‌కుమార్‌, క‌రుణాస్‌, జ‌య‌రామ్‌, సూర‌జ్ వెంజ‌నాయుడు త‌దిత‌రులు
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
సినిమాటోగ్రఫీ: తెని ఈశ్వర్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
రచన: ఆల్‌ఫ్రెడ్ ప్రకాష్, విఘ్నేష్ రాజా
నిర్మాత: ఇషారి కె.గణేష్
బ్యానర్స్:వెల్స్ ఫిలిం ఇంట‌ర్నేష‌నాల్‌, థింక్ స్టూడియోస్‌
దర్శక’త్వం: విఘ్నేష్ రాజా
విడుదల లేదీ: 30.04.26
సినిమా నిడివి: 161 నిమిషాలు

ధనుష్ హీరోగా సినిమా వస్తోందీ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. తెలుగులో కూడా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌మిళ్ నుంచి అనువాద‌మై ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ అయిన చాలా సినిమా తెలుగులో హిట్ అయ్యాయి. తాజాగా విఘ్నేష్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన క‌ర చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? ఈ సినిమాతో ధనుష్ మరో సక్సెస్ అందుకున్నాడా? అనేది తెలుసుకుందాం.

కథ:

త‌న ఇంట్లోనే దొంగ‌త‌నం చేసి డ‌బ్బుతో పారిపోయిన క‌ర‌స్వామి అలియాస్ క‌ర‌(ధ‌నుష్‌).. కొన్ని సంవ‌త్స‌రాల పాటు దొంగ‌త‌నాలు చేస్తూనే జీవిస్తాడు. ఆ తర్వాత త‌న ప్రియురాలి కోసం దొంగ‌త‌నాలు మానెయ్యాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. స్నేహితుడితో క‌లిసి చివ‌రి దొంగ‌త‌నానికి పాల్ప‌డ‌తాడు. ఆ క్ర‌మంలో క‌ర పోలీసుల‌కు దొరికిపోతాడు. అతని స్నేహితుడు తపించుకుంటాడు. పోలీసుల నిర్బంధంలో ఉన్న క‌ర‌పై అత‌ను చేసిన నేర‌మే కాకుండా మ‌రికొన్ని దొంగ‌తనాలు కూడా చేర్చి కేసును ప‌టిష్టం చెయ్యాల‌ని చూస్తాడు ఓ పోలీస్ ఆఫీస‌ర్. దీనితో క‌ర అత‌నిపై దాడి చేసి పోలీస్ స్టేష‌న్ నుంచి త‌ప్పించుకుంటాడు. క‌ట్ చేస్తే.. ఆరు నెల‌ల త‌ర్వాత త‌న భార్య‌తో క‌లిసి ఓ హోటల్‌లో ప‌నిచేస్తుంటాడు. అలా వచ్చే డబ్బు చాలా తక్కువగా ఉండడంతో త‌నే ఓ హోట‌ల్ పెట్టాల‌ని డిసైడ్ అవుతాడు. తాకట్టు పెట్టడానికి అత‌ని ద‌గ్గ‌ర ఎలాంటి ఆస్తీ లేక‌పోవ‌డంతో బ్యాంకు వారు లోన్ ఇచ్చేందుకు నిరాక‌రిస్తారు. చివరికి త‌న తండ్రి పేరు మీద ఉన్న పొలాన్ని తాక‌ట్టు పెట్టాల‌నుకుంటాడు. కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత వాళ్ల ఊరికి వెళ్తాడు. తండ్రికి విషయం చెబుతాడు. అప్ప‌టికే పొలం తాక‌ట్టు పెట్టి ట్రాక్ట‌ర్ తీసుకున్నాన‌ని చెబుతాడు తండ్రి. అయితే పొలాన్ని అమ్మేస్తే డబ్బు వస్తోందని, అందులో త‌న‌కు కొంత డ‌బ్బు ఇస్తే వ్యాపారం చేస్తాన‌ని తండ్రితో చెబుతాడు క‌ర‌. పొలం అమ్మడానికి కర తండ్రి ఒప్పుకోడు. అదే స‌మ‌యంలో బ్యాంక్ లోన్ క‌ట్ట‌ని కార‌ణంగా పొలం జ‌ప్తు చేస్తామ‌ని నోటీసు వ‌స్తుంది. ఒకరోజు క‌ర తండ్రి చ‌నిపోతాడు. అత‌ని శ‌వాన్ని ఖ‌న‌నం చేసే స‌మ‌యంలో బ్యాంకు అధికారులు వ‌చ్చి జ‌ప్తు నోటీసు వ‌చ్చిన త‌ర్వాత ఆ భూమిని దేనికీ ఉప‌యోగించ‌కూడ‌ని చెబుతారు. లోన్ క్లియర్ చేసిన తర్వాతే శవాన్ని ఖననం చెయ్యాలంటారు. అలాంటి పరిస్థితిలో క‌ర ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? త‌న పొల‌లోనే త‌న‌ని ఖ‌న‌నం చెయ్యాల‌న్న చివ‌రి కోరిక‌ను తీర్చేందుకు, బ్యాంకు లోన్ క‌ట్టేందుకు డ‌బ్బు ఎలా సంపాదించాడు? ఈ క్ర‌మంలో అత‌నికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? త‌న తండ్రిలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఆస్తులు పోగొట్టుకునే స్థితికి వ‌చ్చిన ఆ ఊరి వారి కోసం క‌ర ఏం చేశాడు? అనేది మిగతా కథ.

విశ్లేషకుడు:

ఒక చిన్న పాయింట్‌తో అల్లిన పెద్ద కథ ఇది. ఈ కథ చుట్టూ అనేక అంశాలను జోడించారు. అయితే డైరెక్ట‌ర్‌లోని గొప్ప‌త‌నం.. సినిమా స్టార్ట్ అయిన మొద‌టి నిమిషంలోనే క‌థ‌లోకి వెళ్లిపోయాడు. ఎలాంటి ఇంట్ర‌డ‌క్ష‌న్స్‌గానీ, హీరో ఎలివేష‌న్స్‌గానీ లేకుండా కేవ‌లం త‌ను అనుకున్న క‌థ‌పై, క‌థ‌నంపై దృష్టి పెట్టాడు. సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత ఫ‌స్ట్‌హాఫ్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల్ని సీట్ల నుంచి క‌ద‌ల‌కుండా చేయ‌డంలో డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఉన్న గ్రిప్‌గానీ, సస్పెన్స్‌గానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌గానీ సెకండాఫ్‌లో లేవు. సెకండాఫ్ మొద‌లైన కొంత సేప‌టి త‌ర్వాత సినిమా నెమ్మ‌దించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌పై క‌నిపించే ర‌క‌ర‌కాల సీన్స్‌పై ఆడియ‌న్స్‌కి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సెకండాఫ్‌లో చూపించిన చాలా అంశాలు అంతకుముందు చాలా సినిమాల్లో చూసి ఉండడం వల్ల ప్రేక్షకులకి కొత్తగా అనిపించింది. అలాగే క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. సినిమాలో కొన్ని మెరుపులు మాత్రం ఆడియన్స్‌కి కొత్తగా అనిపించాయి. అవి కూడా ఫస్టాఫ్‌లోనే ఎక్కువ. రొటీన్‌గా వ‌స్తున్న కొన్ని సినిమాల మ‌ధ్య‌లో ఎంతో కొంత కొత్త ద‌నాన్ని చూపించేందుకు డైరెక్ట‌ర్ ప‌డిన త‌ప‌న మ‌న‌కు ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తుంది. టెక్నికల్‌గా అన్ని విష‌యాల్లో తీసుకున్న జాగ్ర‌త్త‌లు కూడా మ‌న‌కు అర్థ‌మ‌వుతాయి.

నటీనటులు:

క‌ర పాత్ర‌కు ధ‌నుష్ ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోయాడు. ఇలాంటి క్యారెక్టర్లు చెయ్యడం అతనికి కొట్టిన పిండి కాబట్టి పెర్ఫార్మెన్స్ విషయంలో అతనికి వంక పెట్టడానికి లేదు. క‌ర భార్య‌గా న‌టించిన మ‌మిత బైజు పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు. చాలా రొటీన్‌గా ఉండే క్యారెక్టర్. అద్బుతంగా పెర్‌ఫార్మ్ చేసే స్కోప్ కూడా ఆమెకు లేదు. ఇక డిఎస్‌పి భ‌ర‌త‌న్‌గా న‌టించిన సూర‌జ్ వెంజ‌నామూడు సినిమాలో ఎక్కువ భాగం క‌నిపిస్తాడు. అతణ్ణి నటన బాగుంది. బ్యాంక్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన జ‌య‌రామ్ త‌న పెర్‌ఫార్మెన్స్‌లో ర‌క‌ర‌కాల షెడ్స్ చూపించారు. క‌ర తండ్రిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ అద్భుతంగా న‌టించ‌ని చెప్పాలి. క‌ర మామ‌గా క‌రుణాస్ కూడా మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు.

నిపుణులు సాంకేతిక:

టెక్నికల్ సైడ్ ఈ సినిమాలో గొప్ప విశేషాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇది ఎంతో నేచుర‌ల్‌గా తీసిన సినిమా. ఏ సీన్లోనూ ఎలాంటి ఆర్భాటాలకు పోలేదు. తెని ఈశ్వర్ ఫోటోగ్రఫీ బాగుంది. సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మూడ్‌కి తగ్‌గట్టు మంచి లైటింగ్‌తో చేశారు. ఇక జి.వి.ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే.. క‌థ‌ను న‌డిపే పాట‌ల‌ను సంద‌ర్భానుసారం బాగా ట్యూన్ చేశాడు. బ్యాక్‌స్కోర్ చాలా బాగా కుదిరింది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ కూడా బాగుంది. డైరెక్ట‌ర్ విఘ్నేష్ రాజా గురించి చెప్పాలంటే.. ఒక మంచి క‌థ అనుకొని దాన్ని ఫ‌స్ట్‌హాఫ్ వ‌ర‌కు ఎంతో గ్రిప్పింగ్‌గా న‌డిపారు. సెకండాఫ్‌కి వచ్చేసరికి బ్యాంకు వారి మోసాలు అనే ఓ కొత్త కథ వచ్చి చేరడంతో సినిమా నెమ్మదించింది. ఆ త‌ర్వాత హీరో చేసే కార్య‌క్ర‌మాలు ఎన్నో సినిమాల్లో చూసేసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఆ విష‌యంలో డైరెక్ట‌ర్ కొత్త ద‌నాన్ని చూపించ‌లేక‌పోయాడు.

ప్లస్ పాయింట్లు:

ఫస్టహాఫ్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ధనుష్ పెర్ఫార్మెన్స్

మైన్స్ పాయింట్స్:

సెకండాఫ్
సెకండాఫ్‌లో రొటీన్ అనిపించే అంశాలు
ఇంట్రెస్టింగ్‌గా లేని క్లైమాక్స్
ప‌క్క‌దారి ప‌ట్టిన క‌థ‌

ఫైన‌ల్‌గా చెప్పాలంటే..

ఈ త‌ర‌హా సినిమాలు గ‌తంలో ఎన్నో వ‌చ్చిన‌ప్ప‌టికీ ఫ‌స్ట్‌హాఫ్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల్ని సీట్ల‌లో క‌ద‌ల‌కు కూర్చోబెట్టాడు డైరెక్ట‌ర్‌. ధనుష్ పర్ఫార్మెన్స్, డైరెక్ట్ టేకింగ్ కోసం ఒకసారి ఈ సినిమా చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

– జి.హరా

నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు/అభిప్రాయాలు రచయిత పంచుకున్న వ్యక్తిగత అభిప్రాయాలు/అభిప్రాయాలు మరియు సంస్థ వాటికి బాధ్యత వహించదు. వీక్షకుల విచక్షణతో వారికి ప్రతిస్పందించే ముందు సలహా ఇవ్వబడుతుంది.

2,801 Views

You may also like

Leave a Comment