Home ట్రెండింగ్ టారిఫ్ భారీగా పెంచిన ట్రంప్ | వాణిజ్య ఒప్పందాన్ని పాటించనందున వచ్చే వారం నుంచి EU కార్లు మరియు ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధించనున్న ట్రంప్ – VRM MEDIA

టారిఫ్ భారీగా పెంచిన ట్రంప్ | వాణిజ్య ఒప్పందాన్ని పాటించనందున వచ్చే వారం నుంచి EU కార్లు మరియు ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధించనున్న ట్రంప్ – VRM MEDIA

by VRM Media
0 comments
టారిఫ్ భారీగా పెంచిన ట్రంప్ | వాణిజ్య ఒప్పందాన్ని పాటించనందున వచ్చే వారం నుంచి EU కార్లు మరియు ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధించనున్న ట్రంప్


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. యూరోపియన్ యూనియన్ నుండి అమెరికాలో దిగుమతి అయ్యే అన్ని రకాల కార్లు, ట్రక్కులపై ఇప్పుడున్న టారిఫ్ కు అదనంగా మరో 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించకపోవడం వల్ల ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో తన అభ్యంతరాలు ఏమిటో స్పష్టం చేయలేదు.

ట్రూత్ సోషల్ లో దీనికి సంబంధించిన పోస్ట్ చేశారు ట్రంప్. యూరోపియన్ కార్ల తయారీదారులు తమ వాహనాలను అమెరికాలోనే ఉత్పత్తి ఈ టారిఫ్ నుంచి మినహాయింపు లభిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం అనేక ఆటోమొబైల్, ట్రక్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని, వాటి విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అన్నారు. ఆయా పెట్టుబడులతో, కార్లు, ట్రక్కుల తయారీ జరగడం ఓ రికార్డుగా అభివర్ణించారు. అమెరికన్ కార్మికులతో పనిచేసే ఈ పనులు త్వరలో ఓపెన్ అవబోతున్నాయి.

వాణిజ్య ఒప్పందాన్ని పాటించనందున వచ్చే వారం నుంచి EU కార్లు మరియు ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధించనున్న ట్రంప్

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ గత ఏడాది జూలైలో ట్రేడ్ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆ ఒప్పందాలను యూరోపియన్ యూనియన్ దేశాలేవీ కూడా అమలు చేయలేదనేది ట్రంప్ ఆరోపణ.నాటి ఒప్పందం ప్రకారం.. యూరోపియన్ కార్ మేకర్స్ ఆటోమొబైల్స్, విడిభాగాలతో సహా చాలా వస్తువులపై 15 శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. స్కాట్లాండ్‌లోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ పేరుతో టర్న్‌ అగ్రిమెంట్ గా పిలుస్తారు.

దీన్ని అమలు చేయట్లేదు యూరోపియన్ యూనియన్ దేశాలు. టారిఫ్ మొత్తం కూడా అమెరికా న్యాయస్థానాల్లో చిక్కుకోవడంతో ఈ అదనపు 15 శాతం టారిఫ్ చెల్లింపులు వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ వైఖరి పట్ల ట్రంప్ తాజాగా అసహనం వ్యక్తం చేశారు. 25 శాతం టారిఫ్ విధిస్తోన్నట్లు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తయారయ్యే అన్ని రకాల కార్లు, ట్రక్కులపై ఈ టారిఫ్ వర్తిస్తుందని. అమెరికాలోని వాటిని ఉత్పత్తి చేస్తేనే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.

2,802 Views

You may also like

Leave a Comment