
ఒకప్పుడు ప్రభాస్ హీరోయిన్‌గా చేసిన సంజన చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు షోలో కనిపించింది. అందులో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. అలాగే ఒక తెలుగు సీరియల్ లో కూడా నటిస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.
2015, 16, 17, 18 లో నేను ఒక నలుగురైదుగురికి చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ అంటే 2 కోట్ల వరకు ఇచ్చి ఇరుక్కున్నాను. ఒక ఫిలిం స్టార్ట్ అవుతోంది అంటే 55 లక్షలు ఇచ్చాను. ఎన్నో ఇనాగరేషన్స్ కి ఒక లక్ష రూపాయలు అంటే వాటికి వెళ్లి డబ్బులు బాగా పోగు చేశా. మొత్తం 2 కోట్లు లాస్ అయ్యాను. ఆ డబ్బు తిరిగి రాలేదు. ఒకటి రెండు చెక్ బౌన్స్ కేసులు నడుస్తున్నాయి. అవి ఫాలోఅప్ చేయడానికి కూడా టైం ఉండటం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రొడ్యూసర్. నాతో ఒకే ప్లేట్ లో తిన్న వాళ్ళకే ఇచ్చానండి ఆ డబ్బు. నేను ఒకరిద్దరు జ్యోతిష్యుల దగ్గర చూపించాను. నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళు నా జీవితంలో ఉండరు. వాళ్ళు నీ శత్రువులే అవుతారు. ఇండస్ట్రీ చాలా క్రూరమయినది. పడిపోతే చూసి నవ్వేవాళ్లే ఎంజాయ్ చేసేవాళ్ళే ఉన్నారు. నేను చాలామంది హీరోస్ తో చేసాను. ఇప్పుడు నేనే చేయాలనుంది. విమెన్ సెంట్రిక్ మూవీ చేయనుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ గారితో , బాలకృష్ణ గారితో చేయాలనుంది. వాళ్ళతో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. కాకపోతే నా చుట్టూ తిరిగే కథలోనే నేనే నటించాలని ఉంది. ఇక ఇప్పుడు స్టార్ మాలో ఏ దేవి వరము నీవు అనే సీరియల్ లో చేస్తున్నా. అందులో నటనకు చాలా స్కోప్ ఉంది అని చెప్పింది సంజన గల్రాని.