

కింగ్ నాగార్జున(నాగార్జున)ప్రస్తుతం తన 100వ చిత్రంతో ప్రస్తుతం ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ దర్శకుడు రా కార్తీక్(రా కార్తీక్)దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా వినయంగా సబ్జెట్‌తో రూపొందించబడింది. ఇక నాగార్జున వ్యక్తిగత విషయానికి వస్తే తన అనుమతి లేకుండా నాగార్జున టీ షర్ట్స్ ని ఒక సంస్థ విక్రయిస్తుండంతో కొన్ని రోజుల క్రితం నాగార్జున ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించారు.
నిన్న ఈ కేసు హియరింగ్ కి రాగా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)స్పందిస్తు నాగార్జునతో నేరుగా ఒప్పందం లేనప్పుడు ఆయన పేరు, ఫోటోలని వాడుకుంటూ టీ షర్టులు ఎలా అమ్ముతారు. మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా హక్కులు పొందామని చెప్తే సరిపోతుందా! ప్లెయింటిఫ్ (నాగార్జున) తో మీకు పరిచయం కూడా లేనప్పుడు ఆ వస్తువులని అమ్మే చట్టబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది. కేవలం మాటలతో కాకుండా, అందుకు సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉంటే వారంలోపు సమర్పించాలని కోర్టు సదరు సంస్థని ఆదేశించింది.
నాగార్జున గత ఏడాది సెప్టెంబర్‌లో తన అనుమతి లేకుండా తన పేరు, వాయిస్, చిత్రాలను వాణిజ్యపరంగా వాడుకుంటున్న పలు సంస్థలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లోనే కోర్టు ‘మధ్యంతర ఇంజంక్షన్’ ఇస్తూ ఎవరూ ఆయన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించకూడదని ఆదేశించింది. అయితే, ‘ఘోస్ట్’ సినిమాకు సంబంధించిన మర్చండైజ్ పార్టనర్ అని చెప్పుకుంటూ ఒక సంస్థ నాగార్జున బొమ్మతో ఉన్న టీ-షర్టులను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ సంస్థకే కోర్టు చివాట్లు పెట్టింది. ఈ తీర్పుతో నాగార్జునకి ఊరట లభించిందని చెప్పవచ్చు . ఈ కేసులో కేవలం వస్తువులే కాకుండా, నాగార్జున గారి ముఖాన్ని అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్న వెబ్‌సైట్లపై కూడా కోర్టు నిషేధం విధించింది. కేసు విచారణ తదుపరి ఆగస్టు 3, 2026కి వాయిదా పడింది. అప్పటివరకు సదరు వ్యాపారులు నాగార్జున బ్రాండ్‌ని వాడకుండా కోర్టు తన తీర్పుతో కట్టడి చేసింది.