

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గ్లామర్ క్వీన్ త్రిష జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కరుప్పు’ (కరుప్పు) ఎట్టకేలకు ఈరోజు (మే 15) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ‘వీర భద్రుడు’ (Veera Bhadrudu) పేరుతో విడుదలైంది. ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల ఒక్క రోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ, సినిమాపై ఉన్న అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. మార్నింగ్ షోలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి ఈ సినిమా సూర్య అభిమానులను ఏ మేరకు మెప్పించిందో ట్విట్టర్ (X) రివ్యూలో చూద్దాం! (కరుప్పు ట్విట్టర్ రివ్యూ)
‘కరుప్పు’ చిత్రం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలైట్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
సినిమా మొదలైన 30 నిమిషాల తర్వాత స్క్రీన్ పై సూర్య కనిపించింది, ఎంట్రీ మాత్రం అదిరిపోయిందట. మెట్రో ఫైట్ సీక్వెన్స్, ‘వీరప్ప’ సాంగ్, ఫైట్ సీన్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయని, యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ నాచ్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు.
కొన్ని సీన్లు ‘కేజీఎఫ్’ స్థాయి గూస్ బంప్స్ ఇచ్చాయని, సూర్య తన మాస్ పవర్‌తో బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని మళ్ళీ చాటుకున్నాడని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత జంటగా నటించిన సూర్య, త్రిషల స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని, త్రిష తన నటనతో మరోసారి ఆకట్టుకుందని టాక్. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసలు దక్కుతున్నాయి.
ట్విట్టర్ టాక్ ని బట్టి చూస్తే.. ‘కరుప్పు’ సినిమాతో సూర్య ఒక భారీ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఆర్జే బాలాజీ దర్శకత్వ ప్రతిభ, సూర్య పవర్ ఫుల్ యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఈ ఏడాది కోలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా ‘కరుప్పు’ నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారాంతంలో థియేటర్లలో సూర్య మేనియా కొనసాగడం ఖాయంగా కనిపించింది.