Home Uncategorized ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి సహకరించండి

ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి సహకరించండి

by VRM Media
0 comments

VRM మీడియా అయినవిల్లి భద్రం

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వినతి అందించిన ఎమ్మెల్యే శిరీషాదేవి

👉రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

పోలవరం జిల్లా లోని నీటిపారుదల శాఖల అభివృద్ధి పనులు కోసం సహకరించాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కోరారు. పోలవరం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులు కోసం ఆమె గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి శుక్రవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లా పై కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే మా ఏజెన్సీ వ్యాప్తంగా ఎక్కువగా వర్షాధార పంటలు పై ఆధారమన్నారు. పోలవరం జిల్లా వ్యాప్తంగా ఉన్న నీటి పారుదల శాఖ, రిజర్వాయర్లు ఆయా వాటి ద్వారా అందించే సాగునీటి సౌకర్యాలు మెరుగు పరిచే విధంగా చేయాలని కోరారు. వాస్తవంగా కూడా నీటిపారుదల శాఖల ద్వారా అందాల్సిన సాగునీరు కూడా పూర్తిగా అందలేని పరిస్థితులు మన్యంలో ఉన్నాయన్నారు. వీటి పై దృష్టి పెట్టాలని తద్వారా రైతులకు మంచి జరుగుతుందని విన్నవించారు.
అలాగే పోలవరం జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిలో పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ , కూనవరం మండలం పార్టీ అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

2,802 Views

You may also like

Leave a Comment