
టాలీవుడ్ హోమ్లీ బ్యూటీ, జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా సినిమాల విషయంలో ఏమాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. ఒకవైపు వివాహ బంధంలోకి అడుగుపెట్టినా, మరోవైపు అర డజనుకు పైగా ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో గడుపుతోంది. అయితే గత కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ లుక్ చూసి అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా షాక్ అవుతున్నారు. గతంలో కంటే చాలా నాజూకుగా, మరింత మోడ్రన్‌గా కనిపిస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన ఒక జిమ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేస్తోంది.
తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో వర్కౌట్ చేస్తున్న ఒక సుదీర్ఘమైన వీడియోను పంచుకుంటూ, తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, ఎదుర్కొన్న విమర్శలను అభిమానులతో పంచుకుంది ఈ మహానటి. అప్పట్లో తను ఒక్కసారిగా సన్నబడటం చూసి, చాలా మంది సర్జరీలు చేయించుకుందని పుకార్లు పుట్టించారు. వాటన్నింటికీ ఈ వీడియోతో కీర్తి గట్టి సమాధానం చెప్పింది.
సురేష్ తన పోస్ట్‌లో రాస్తూ.. “2013లో నేను కెరీర్ ప్రారంభించిన కొత్తలో నాకు అసలు జిమ్ అంటే ఏంటో తెలియదు. నాలాంటి వాళ్లకు జిమ్ అవసరమా? అనుకునేదాన్ని. కానీ 2018లో ‘మహానటి’ సినిమా తర్వాత వచ్చిన చిన్న బ్రేక్‌లో జిమ్ ట్రై చేయాలని అనుకున్నాను. చెప్పుకొచ్చింది.
తొలినాళ్లలో ‘నేను శైలజ’ వంటి సినిమాల్లో చాలా బొద్దుగా, ముద్దుగా కనిపించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచడానికి తన బాడీని పూర్తిగా మార్చేసింది. గతంలో కేవలం ట్రెడిషనల్ లుక్స్‌లోనే కనిపించిన కీర్తి, ఇప్పుడు స్లిమ్ ఫిగర్‌తో మోడ్రన్ డ్రెస్సుల్లో కూడా నెటిజన్లను కట్టిపడేస్తోంది. దశాబ్ద కాలంగా పరిశ్రమలో ఉన్నా ఈమె క్రేజ్ అస్సలు తగ్గకపోవడం విశేషం.
ఈ సరికొత్త జిమ్ వీడియోపై నెటిజన్లు, అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అప్పట్లో సర్జరీలంటూ ట్రోల్ చేసిన వారికి ఇదొక గట్టి చెంపదెబ్బ అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘రౌడీ జనార్ధన’ సినిమాతో పాటు పలు భారీ చిత్రాల్లో నటిస్తున్న కీర్తి సురేష్, రాబోయే రోజుల్లో గ్లామరస్ రోల్స్‌తో టాలీవుడ్ టాప్ హీరోల సరసన మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.