
భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
తమిళనాడులోని విల్లుపురం వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పాయి. లోకో పైలట్ గమనించి వెంటనే రైలును నిలిపివేశాడు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ రూట్ లోని ఇతర రైలు సర్వీసులు నిలిచిపోయాయి. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తున్న రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తమిళనాడుకు నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.
అలాగే విల్లుపురం ప్రాంతంలో ఓ మేము ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పాయి. విల్లుపురం నుంచి పుదుచ్చేరి వెళ్తున్న మేము రైలు విల్లుపురం సమీపంలో పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలులో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.
అయితే ఇటీవల రైలు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఏదైనా ఇలాంటి ఘటనల వల్ల ప్రయాణికులు రైలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. మన దేశంలో వేలమంది రైలు ప్రయాణాలే నిత్యం చేస్తుంటారు. తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు చేరుకోవడంలో రైలు ప్రయాణం మేలని ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళనను పెంచుతున్నాయి.

ఇటీవల రాజధాని ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాట్నా ఫాస్ట్ పాసింజర్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే తాజాగా ఉజ్జయినీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడు రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి రైలును రైల్వే యార్డుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇక తాజాగా విల్లుపురంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు రైలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు.