

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (డ్రాగన్) సినిమాలో జూనియర్ రుక్మిణి వసంత్ (రుక్మిణి వసంత్) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆమె లుక్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.
వెండితెరపై ఎంతో పద్ధతిగా, హోమ్లీ లుక్‌లో కనిపించి కుర్రకారుని గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈ 29 ఏళ్ల బెంగళూరు భామ.. తాజాగా ఊహించని విధంగా అత్యంత గ్లామర్స్ అవతారంలో దర్శనమిచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. పూల్‌సైడ్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రీన్ కలర్ బికీనీ ధరించి కెమెరాలు, షూటింగ్ సిబ్బంది మధ్య ఆమె ఉన్న ఒక స్పెషల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో వేలాది వ్యూస్, లైకులను సాధించి విపరీతంగా వైరల్ అవుతోంది. రుక్మిణి వసంత కెరీర్‌లోనే ఇలాంటి ఆల్ట్రా బోల్డ్ బికీనీ లుక్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో, నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఈ గ్రీన్ బికీనీ వీడియో చూసిన అభిమానులు రుక్మిణి వసంత్ గ్లామర్ అప్పీల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడూ చీరకట్టులో, సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో చూసిన తమ అభిమాన నటిని ఈ రేంజ్ హాట్ అవతారంలో చూసేసరికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
అయితే, ఈ వీడియోపై ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో భిన్నమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో, ఇది ఎవరైనా సృష్టించిన ఏఐ డీప్‌ఫేక్ వీడియో కావచ్చు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం రుక్మిణికి చీరకట్టు, ట్రెడిషనల్ లుక్సే ఎంతో అందంగా ఉంటారని.. ఇలాంటి బోల్డ్ లుక్స్ సెట్ కావు అంటూ అభిప్రాయపడుతున్నారు.