

సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్షకుల’ను నవ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ నుంచి ఇప్పుడు సీజన్ 3 రాబోతుందని జియో హాట్ స్టార్‌గా ప్రకటించింది. మొదటి రెండు సీజన్లలో సరదా, హాస్యం, చురుకైన డైలాగులు, రిలేషన్‌షిప్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్‌లో మూడో సీజన్ రాన సందర్భంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. (సేవ్ ది టైగర్స్ 3)
2023లో వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ చైజీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రత్యేకమైనని సంపాదించుకుంది. తాజాగా రూపొందించిన సేవ్ ది టైగర్స్ సీజన్ 3కి మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్. ఈ సీజన్ మరింత అసక్తికరమైన ట్విస్టులు, కొత్త పాత్రలతో ప్రేక్షకులను అలరించటానికి సన్నద్ధమవుతోంది.
తాజాగా విడుదల చేసిన ‘సేవ్ ది టైగర్స్ సీజ’న్ 3’ పోస్టర్ చూస్తుంటే కథలో ఆస’క్తిక’రమైన కాస్మిక్ ట్విస్ట్ ఉండబోతుందనే విష’యం. రెండు వైవిధ్యమైన ప్రపంచాల మధ్య జరిగే ప్రత్యేకమైన సోషల్ ఎక్స్‌పెరిమెంట్ కథను మరింత ఆసక్తికరంగా మార్చనుంది. ఈ అంశం మొత్తం కథను సరికొత్త పంథాలో ప్రేక్షకులని అందించనుంది. మూడు జంటలు.. అందులోని భర్తలు పడే ఇబ్బందులు.. వారి చుట్టూ తిరిగే కామెడీ డ్రామాకు కాస్మిక్ ట్విస్ట్ అనేది ఎగ్జయిటింగ్ కాన్సెప్ట్‌గా మారింది. ఇది కథను సరికొత్త విధానం చూపించడంతో పాటు సమాజంపై అర్థవంతమైన వ్యాఖ్యానానికి కూడా అవకాశం దక్కనుంది. ప్రేక్షకులు మరోసారి నవ్వులు, రిలేషన్‌షిప్ సమస్యలు, సరదా, కామెడీ డ్రామా ఇలా అన్నీ ఎలిమెంట్స్ కలిసున్న ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌గా సీజన్3ని ఎంజాయ్ చేయొచ్చు.
మొదటి రెండు సీజన్లలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రియ దర్శి-జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య-దేవియాని శర్మ, అభినవ్ గోమ’టం-పావ’ని గంగిరెడ్డి జంటల సీజన్ 3లోనూ అలరించనున్నారు. ఇక ఈ సీజన్3లో అందరికీ పెద్ద సర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించబోతున్నారు. పోస్టర్ చూస్తుంటే ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ పాత్ర కథలో అనూహ్యమైన మలుపులు తీసుకురావడమే కాకుండా, అద్భుత కామెడీ టైమింగ్‌తో పాటు గుర్తుండిపోయేలా డ్రామాటిక్ పెర్ఫామెన్స్‌తో సిరీస్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చబోతున్నార’ని అభిమానులు.
ఈ అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ త్వరలో జియోస్టార్‌లో స్ట్రీమింగ్ సంస్థ.