
భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అంటే టక్కున విజయ్ అని చెప్పేస్తాం.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. పార్టీ పెట్టిన రెండు నెలల్లోనే విజయ్ టీవీకే పార్టీ రెండు కంచుకోటలుగా భావించే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను తుంగలో తొక్కి అధికారాన్ని కైవసం చేసుకుంది. విజయ్ విజయం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఓ ప్రభంజనం.. అప్పట్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి మహనీయులు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పార్టీ పెట్టి సీఎం అయ్యారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత వారి స్థానంలో విజయ్ చేరారు.
ఇది ఏమిటి సార్? ఇంగ్లీషులో, మాజీ ముఖ్యమంత్రి పేరు ప్రదర్శించబడుతుంది, దయచేసి దాన్ని సరిదిద్దండి pic.twitter.com/qP7lgR7CyV
— అరుణ పి (@RparunaP) మే 25, 2026
ఇక విజయ్ సీఎం అయిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల మద్యపాన నిషేధం అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే తాజాగా తమిళనాడులోని రైతులకు రుణ మాఫీ చేశారు. రూ. 50 వేల వరకు రుణ మాఫీ చేస్తూ సీఎం విజయ్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడ్డాయి. అయితే ఆ ప్రకటన తమిళంలో వెలువడ్డాయి. ఈ విశేషాలను ఎక్స్ లోని సీఎంఓ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ ఆప్షన్ ఉంది. ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కే. స్టాలిన్ అని ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పోస్టు కింద సీఎం స్టాలిన్ అని హ్యాష్ ట్యాగ్ కూడా ఉండటంతో నెటిజన్లు ఈ పోస్టును సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ చేస్తున్నారు. గ్రోక్ ఏఐ ఇలా ఉందేంటి..? అని కామెంట్స్ పెడుతున్నారు. త్వరగా మార్చండి సర్ అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే గ్రోక్ ట్రాన్స్ లేషన్ కూ రిప్ అంటూ మరికొంత మంది అంటున్నారు.
మరికొంతమంది నెటిజన్లు.. ఐదు ఎకరాల వరకు రైతు రుణమాఫీ అని చెప్పి కేవలం రూ. 50 వేలు మాఫీ చేయడం ఏంటని సీఎం విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం తమిళనాడు రాష్ట్రంలో ప్రజా పాలన ప్రారంభమైందని అంటున్నారు. ఇదిలా ఉంటే సీఎం విజయ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై రిలీజ్ అయ్యే ప్రతి తమిళ సినిమా మొదటి వారం ఐదు షోలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించిన సీఎం విజయ్..